Samantha : సమంత ఐటెం సాంగ్ కి కౌంటర్ గా వైరల్ అవుతున్న మేల్ వర్షన్ సాంగ్

సమంత నిన్న రిలీజ్ అయిన 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మామ.. ఊ ఊ అంటావా మామ' అంటూ ఓ ఐటెం సాంగ్ చేసింది. అయితే ఈ పాటలో మగాళ్లందరిని తిడుతూ ఉన్న లిరిక్స్ ఉన్నాయి. దీంతో ఈ పాట విడుదల......

Samantha : సమంత ఐటెం సాంగ్ కి కౌంటర్ గా వైరల్ అవుతున్న మేల్ వర్షన్ సాంగ్

Samantha

Samantha :  టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మామ.. ఊ ఊ అంటావా మామ’ అంటూ ఓ ఐటెం సాంగ్ చేసింది. అయితే ఈ పాటలో మగాళ్లందరిని తిడుతూ ఉన్న లిరిక్స్ ఉన్నాయి. దీంతో ఈ పాట విడుదల అయిన దగ్గర్నుంచి వివాదాలు చుట్టూ ముట్టాయి. కొన్ని చోట్ల ఈ పాట మీద కేసులు కూడా పెట్టారు. తమిళనాడులో కూడా ఈ పాట మీద వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో అయితే సమంత, చంద్రబోస్ ని విమర్శిస్తూ మీమ్స్ కూడా వేశారు. ఈ పాటపై కొన్ని పురుష సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిని తొలిగించాలని కూడా డిమాండ్ చేశారు. కానీ సినిమా టీం అసలు వీటిని పట్టించుకోలేదు.

Bigg Boss 5 : బిగ్‌బాస్‌ షోలోకి మాజీ కంటెస్టెంట్స్

అయితే ఇప్పుడు ఈ సాంగ్ కి కౌంటర్ సాంగ్ గా మేల్ వర్షన్ సాంగ్ వచ్చింది. మగాళ్లంతా ఇంతే అన్న ఈ పాటకి కౌంటర్ ఇస్తూ ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళే అంటూ ఓ సాంగ్ ని రాసి పాడి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. దీంతో ఈ పాట ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో ”సిక్స్ ప్యాక్ కావాలంటారు.. పొట్ట ఉంది డబ్బులు ఉంటే పర్లేదంటారు.. బైక్ ఉన్నోడు కావాలి.. కార్ ఉన్నోడు వస్తే బైక్ వాడ్ని వదిలేస్తారు.. మీకు మనసు కన్నా డబ్బులే ముఖ్యం.. షాపింగ్, సినిమా షికార్ల పేరుతో ఊడ్చేస్తారంటూ..” లిరిక్స్ ని రాశారు. ఊ అంటావా మామ ప్లేస్ లో ‘ఊ అంటావా పాపా.. ఊ ఊ అంటావా పాపా..’ అంటూ లిరిక్స్ రాశారు. దీంతో ఈ లిరిక్స్, సాంగ్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నాయి. ఈ పాటని ప్రశాంత్ రాయగా, రేలారే రేలా ఫేమ్ రమణ పాడారు.