Bigg Boss 5 : బిగ్‌బాస్‌ షోలోకి మాజీ కంటెస్టెంట్స్

అయితే ఈ సారి మాజీ కంటెస్టెంట్స్ ఎవర్ని తీసుకొస్తారు అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి లీక్ అయినా సమాచారం ప్రకారం ఈ సారి మాజీ కంటెస్టెంట్స్.........

Bigg Boss 5 : బిగ్‌బాస్‌ షోలోకి మాజీ కంటెస్టెంట్స్

Biggboss

Bigg Boss 5 :  బిగ్ బాస్ మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. రోజు రోజుకి షోలో మరిన్ని ట్విస్టులు యాడ్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్ కి గెస్ట్ ఎవరు వస్తారు అనేది చాలా ఇంట్రెస్ట్ గా మారింది. అంతే కాక ఈ సీజన్ లో మాజీ కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అని కూడా ఆలోచిస్తున్నారు. బిగ్ బాస్ ప్రతి సీజన్ లో చివరి దశలో మాజీ కంటెస్టెంట్స్ వచ్చి ఫైనల్ కంటెస్టెంట్స్ తో మాట్లాడతారు. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో కూడా మాజీ కంటెస్టెంట్లు సందడి చేయబోతున్నారు. ప్రతి సీజన్‌లాగే ఈ సారి కూడా హౌస్‌లోని ఫైనలిస్టులతో మాజీ కంటెస్టెంట్స్ మాట్లాడనున్నారు.

Bheemla Nayak: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. సంక్రాంతి టార్గెట్ అందుకుంటాడా?

అయితే ఈ సారి మాజీ కంటెస్టెంట్స్ ఎవర్ని తీసుకొస్తారు అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి లీక్ అయినా సమాచారం ప్రకారం ఈ సారి మాజీ కంటెస్టెంట్స్ హరితేజ, గీతా మాధురి, రోల్ రైడా, శివబాలాజీ, శివజ్యోతి, రాహుల్ సిప్లిగంజ్, అఖిల్‌ సార్థక్‌లు హౌస్‌లోకి రానున్నారని సమాచారం. అయితే వీళ్ళు హౌస్ లోకి వెళ్లకుండా సపరేట్ గ్లాస్ రూమ్ లో నుంచే కంటెస్టెంట్స్ తో మాట్లాడే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ మాజీ కంటెస్టెంట్స్ తో షోలో ఇంకెంత ఎంటర్టైన్మెంట్ తెస్తారో చూడాలి.