Madhavan : స్విమ్మింగ్ లో వరుస పతకాలు సాధిస్తూ.. ఒలింపిక్స్ కి వెళ్లనున్న మాధవన్ తనయుడు..

మాధవన్ తనయుడు వేదాంత్ ఇటీవల నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో 7 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో ఈ హీరో తనయుడు అందరి దృష్టిలో పడ్డాడు. చిన్నప్పటి నుంచి......

Madhavan : స్విమ్మింగ్ లో వరుస పతకాలు సాధిస్తూ.. ఒలింపిక్స్ కి వెళ్లనున్న మాధవన్ తనయుడు..

Madhavan

Madhavan :   ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు హీరో మాధవన్ ఇప్పుడు డిఫరెంట్ రోల్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక మాధవన్ తనయుడు వేదాంత్ ఇటీవల నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో 7 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో ఈ హీరో తనయుడు అందరి దృష్టిలో పడ్డాడు. చిన్నప్పటి నుంచి శిక్షణ తీసుకొని ప్రస్తుతం వేదాంత్‌ స్విమ్మింగ్ లో రాణిస్తున్నాడు. స్విమ్మర్‌గా నేషనల్‌ వైడ్‌గా ప్రతిభని చాటుతున్నాడు. ఇప్పటికే నేషనల్ చాంపియన్ అయిన వేదాంత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ పోటీలను దృష్టిలో పెట్టుకొని ట్రైనింగ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాడు.

దీంట్లో భాగంగానే వచ్చే ఒలింపిక్స్ లో వేదాంత్‌ భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. అయితే ఇందుకోసం మరింత శిక్షణ తీసుకోవాలి. కాని కోవిడ్‌ ఆంక్షలతో భారత్‌లో ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్‌ పూల్‌ లు అందులో బాటులు లేవు. ముంబైలో ఉన్న కొన్ని పెద్ద స్విమ్మింగ్ ఫూల్స్ కూడా కరోనా వల్ల క్లోజ్ చేసే ఉన్నాయి. దీంతో కొడుకు ట్రైనింగ్‌ కోసం మాధవన్‌, ఆయన భార్య సరితతో కలిసి దుబాయ్‌కి వెళ్లారు. కరోనా ఆంక్షల కారణంగా ముంబయిలోని పెద్ద స్విమ్మింగ్‌ పూల్‌లను మూసివేయడంతో దుబాయ్‌లో ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్‌ పూల్‌లు అందుబాటులో ఉండటంతో వేదాంత్‌ ట్రైనింగ్‌కి అనుకూలంగా ఉంటుందని దుబాయ్ వచ్చాం అని తెలిపారు మాధవన్‌.

Radheshyam : ‘రాధేశ్యామ్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు వాళ్ళే…

ఇక తన కుమారుడి గురించి మాట్లాడుతూ.. తన కుమారుడిని నటుడిగా మార్చడం తనకు ఇష్టం లేదని, జీవితంలో తను ఏం చేయాలనుకుంటే అది చేయిస్తాం అని, ప్రస్తుతం వేదాంత్‌ ప్రపంచ వ్యాప్తంగా స్విమ్మింగ్‌ ఛాంపియన్‌ షిప్స్ లలో పతకాలు గెలుస్తున్నాడు. మేం గర్వపడేలా చేస్తున్నాడు. త్వరలో భారత్ తరపున ఒలంపిక్స్ లో పాల్గొని పతకం సాధిస్తాడని తెలిపారు.