SriLanka New Marriage act : స్థానికులను పెళ్లి చేసుకోవాలంటే..రక్షణశాఖ అనుమతి తప్పనిసరి

శ్రీలంక కొత్త మ్యారేజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం..స్థానికులను పెళ్లి చేసుకోవాలంటే..రక్షణశాఖ అనుమతి తప్పనిసరి చేసింది.

SriLanka New Marriage act : స్థానికులను పెళ్లి చేసుకోవాలంటే..రక్షణశాఖ అనుమతి తప్పనిసరి

Srilanka New Marriage Act

Sri Lanka brings new marriage act : శ్రీలంక ప్రభుత్వ విదేశీయులకు ఝలక్ ఇచ్చింది. సరికొత్త వివాహ చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం..ఇకనుంచి శ్రీలంకవాసులను విదేశీయులు పెళ్లి చేసుకోవాలనుకుంటే… దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చామని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.కానీ ఈ కొత్త చట్టంపై ప్రతిపక్షాలతో పాలు పలు పౌర సంఘాలు కూడా విమర్శలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Read more : Marriage Age: కేంద్రం సంచలన నిర్ణయం.. అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే 21ఏళ్లు దాటాల్సిందే!

ఈ కొత్త వివాహ చట్టం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. “సెక్యూరిటీ క్లియరెన్స్ రిపోర్ట్” పొందిన తర్వాత అదనపు జిల్లా రిజిస్ట్రార్ల ద్వారా మాత్రమే వివాహాలను నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. శ్రీలంకవాసులు, విదేశీయుల మధ్య జరిగే వివాహాల వల్ల జాతీయ భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని…ఇకనుంచి అటువంటివి చెల్లవని..ఇకపై ఈ వివాహాలకు విదేశీయులు ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆఫ్ సెక్యూరిటీ’ని తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని..రిజిస్ట్రార్ జనరల్ వీరశేఖర అక్టోబర్ 18న విడుదల చేసిన సర్క్యులర్ లో పేర్కొన్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకున్న తర్వాతే ఈ వివాహాలను అదనపు జిల్లా రిజిస్ట్రార్ ద్వారా నమోదు చేస్తామని చెప్పారు.

Read more : Marriage Age: 21 ఏళ్ల పెళ్లి వయస్సు..బిల్లు పాస్ అయ్యేలోపు హడావిడిగా వందలాది పెళ్ళిళ్లు..

ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష శాసనసభ్యుడు హర్ష డి సిల్వా మాట్లాడుతు..ఇది విదేశీయులపై వివక్ష చూపించినట్లేనని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు కూడా వ్యతిరేకిస్తున్నారు.

Read more : High Court : ఇద్దరి ఇష్టంతో సహజీవనం ప్రాథమిక హక్కు..వారికి వివాహ వయస్సు లేకున్నాసరే : హైకోర్టు కీలక వ్యాఖ్యలు