High Court : ఇద్దరి ఇష్టంతో సహజీవనం ప్రాథమిక హక్కు..వారికి వివాహ వయస్సు లేకున్నాసరే : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పరస్పర అంగీకారంతో సహజీనం చేయటం ప్రాథమిక హక్కు అని..వారిలో ఎవరికి వివాహ వయస్సు రాకపోయినా..భారతీయ పౌరుడిగా రాజ్యాంగమిచ్చిన హక్కులను పొందకుండా చేయడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది

High Court : ఇద్దరి ఇష్టంతో సహజీవనం ప్రాథమిక హక్కు..వారికి వివాహ వయస్సు లేకున్నాసరే : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Adult Male Without Marriage Can Live With Consenting Partner

Adult male without marriage can live with consenting partner : వివాహం వయస్సు రాకున్నా సహజీవనం చేసే జంట విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భద్రత కోసం కోర్టును ఆశ్రయించిన సహజీవనం చేసే జంటకు భద్రత కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. 2018 మే లో సుప్రీంకోర్టు ఓ కేసు విచారణలోవెలువరించిన తీర్పు లాగానే ఉంది ప్రస్తుతం పంజాబ్,హర్యానా హైకోర్టు వ్యాఖ్యలు. వయోజనులైన స్త్రీ, పురుషుడు వివాహం లేకుండానే సహజీవనం చేసుకోవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఓ జంట రక్షణ కోరుతూ ఆశ్రయించడంతో హైకోర్టు వారికి మద్దతుగా నిలిచింది.

Read more :సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు! 

పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన యువతీ యువకులు వివాహంకాకుండానే (సహజీవనం ) కలిసి ఉంటున్నారు. వీళ్లద్దరికి 18 ఏళ్లు పూర్తి అయ్యాయి. కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం అమ్మాయికి వివాహ వయసు వచ్చింది. కానీ..అబ్బాయికి వివాహ వయస్సు రాలేదు. అంటే 21 ఏళ్లు నిండితేనే అబ్బాయికి వివాహం చేసుకునే అర్హత లభిస్తుంది హిందు వివాహం చట్టం ప్రకారం.

కానీ ఒకరంటే మరొకరికి చాలా ఇష్టం. పెద్దలను ఎదిరించి మరీ సహజీవనం చేస్తున్నారు. కానీ వారి పెద్దలకు వీరి సహజీవనం ఇష్టం లేదు. దీంతో అబ్బాయికి వివాహం వయస్సు కూడా లేదని..వారి సహజీనవం చెల్లదని పెద్దలు వాదిస్తున్నారు. దీంతో వారిని విడదీయటానికి యత్నించారు. దీంతో వారిద్దరు తమకు రక్షణ కల్పించాలంటూ హైకోర్టును వేడుకున్నారు. తమను వేరు చేయాలని చూస్తున్నారని..తమ ప్రాణాలకు కూడా ప్రమాదముందని దయచేసి మాకు రక్షణ కాల్పించాలంటూ కోర్టును వేడుకున్నారు.

Read more : Allahabad HC : వివాహిత మరో వ్యక్తితో సహజీవనం చేయటం హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకం

హైకోర్టు స్పందిస్తూ.. ‘‘రాజ్యాంగం ప్రకారం పౌరుల ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని..పిటిషనర్ (పురుషుడు) వివాహ వయసుకు చేరుకోలేదన్నది నిజం. కానీ ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి..యువకుడికి వివాహ వయస్సు రాకపోయినా.. భారతీయ పౌరుడిగా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పొందకుండా చేయడం సరికాదు’’ అని పేర్కొంది. ఇరువురి అంగీకారంతో సహజీవనం చేయటం అనేది వారి ప్రాథమిక హక్కుఅని స్పష్టం చేస్తు..పిటిషనర్ల దరఖాస్తును పరిశీలించి, వారి ప్రాణాలకు ముప్పు ఉంటే తగిన రక్షణ కల్పించాలంటూ గురుదాస్ పూర్ ఎస్ఎస్ పీని జస్టిస్ హర్నరేష్ సింగ్ ఆదేశించారు.