సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

  • Edited By: veegamteam , August 22, 2019 / 05:48 AM IST
సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

సహజీవనం.. వివాహం చేసుకోకుండా ఒకరిపై ఒకరు ఇష్టం లేక అండర్ స్టాండింగ్ తో కలిసి జీవించడం. సహజీవనం అనేది ఇటీవలకాలంలో భారత్ లో పెరుగుతోంది. ఈ కేసులు కోర్టు మెట్లెక్కుతున్నాయి. పెళ్లి చేసుకుంటానని కలిసుండి తర్వాత.. మోసం చేశారంటూ కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 

ఓ మహిళ తన అంగీకారంతో సహజీవనం చేసి.. అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకుంటే అది అత్యాచారం కిందకు రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సేల్స్‌టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తున్నఓ మహిళ సీఆర్పీఫ్ డిప్యూటీ కమాండెంట్‌తో సహజీవనం చేశారు. ఆరేళ్లు కలిసి ఉన్నారు. వీరిద్దరూ ఒకరి ఇళ్లలో మరొకరు నివాసం కూడా ఉన్నారు. ఆరేళ్ల తర్వాత డిప్యూటీ కమాండెంట్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధం అయ్యారు. ఇద్దరి మధ్య విబేధాలొచ్చాయి. దీంతో ఆమె కోర్టుమెట్లెక్కింది.
 
పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి.. బలవంతంగా శారీరక సంబంధం ఏర్పరచుకు సహజీవనం చేశాడని కోర్టును ఆశ్రయించింది ఆ మహిళ. మరో అమ్మాయిని పెళ్లాడేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడని స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇందిరాబెనర్జీ ధర్మాసనం అత్యాచారం కేసును కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

ఇష్టపూర్వకంగా కలిసి ఉంటే.. అత్యాచారం ఎలా అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది కోర్టు. ఇద్దరి అంగీకారంతోనే కలిసి ఉన్నప్పుడు అత్యాచారం కింద రాదని స్పష్టం చేసింది.