Best Black Friday Sale : బెస్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్లు.. రూ. 40వేల లోపు స్మార్ట్‌ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి!
Best Black Friday Sale : బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా అనేక స్మార్ట్ ఫోన్లపై ఖతర్నాక్ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. రూ. 40వేల లోపు ధరలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
Best Black Friday Sale
Best Black Friday Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తోంది. అనేక ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు రిటైల్ స్టోర్లలో ప్రస్తుతం సొంత బ్లాక్ ఫ్రైడే సేల్స్ నిర్వహిస్తున్నాయి. ధరల తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్‌లు, వైడ్ రేంజ్ ప్రొడక్టులపై అదిరిపోయే ఎక్స్ఛేంజ్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్లపై అత్యంత ఆకర్షణీయమైన (Best Black Friday Sale) డిస్కౌంట్లు అందిస్తున్నాయి. మీ బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. మీరు రూ. 40వేల లోపు ఫోన్ కోసం చూస్తుంటే సరసమైన ధరకు ప్రీమియం ఫీచర్లను అందించే అనేక కొత్త ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 FE 5G :
శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇంకా, ఈ శాంసంగ్ ఫోన్ ఎక్సినోస్ 2400e చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీని అందిస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. గెలాక్సీ S24 FE ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 8MP టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 10MP కెమెరా కలిగి ఉంది. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ గెలాక్సీ S24 FE ధర రూ.31,999కి అందిస్తోంది.
క్రోమాలో గూగుల్ పిక్సెల్ 9a :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ ఫోన్ గూగుల్ టెన్సర్ G4 చిప్, 5100mAh బ్యాటరీతో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 9a బ్యాక్ సైడ్ 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది. క్రోమా వెబ్‌సైట్‌లో పిక్సెల్ ఫోన్ రూ.44,999 తగ్గింపు ధరకు లభిస్తుంది.
విజయ్ సేల్స్‌లో వన్‌ప్లస్ 13R 5G :
వన్‌ప్లస్ 13R 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఇంకా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు 6,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. ఈ వన్‌ప్లస్ ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 16MP కెమెరాను కలిగి ఉంది. విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో వన్‌ప్లస్ 13R ఫోన్ రూ.39,999 తగ్గింపు ధరకు లభిస్తుంది.
క్రోమాలో ఒప్పో రెనో 13 5G :
ఒప్పో రెనో 13 6.59-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. హుడ్ కింద, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,600mAh బ్యాటరీని అందిస్తుంది. ఆప్టిక్స్ పరంగా ఒప్పో రెనో 13 5Gలో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. అలాగే, 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. మీరు క్రోమా వెబ్‌సైట్ నుంచి ఒప్పో రెనో 13 5G మోడల్ రూ.35,999కి పొందవచ్చు.
