Redmi 15C 5G : కొత్త రెడ్‌మి 15C 5G ఫోన్ వచ్చేస్తోందోచ్.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Redmi 15C 5G : రెడ్‌మి నుంచి సరికొత్త రెడ్‌మి 15C 5G ఫోన్ రాబోతుంది. రెడ్‌మి 15C 5G ఫోన్ కెమెరా ఫీచర్లలో బ్యాక్ సైడ్ 50MP కెమెరా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Redmi 15C 5G : కొత్త రెడ్‌మి 15C 5G ఫోన్ వచ్చేస్తోందోచ్.. లాంచ్‌కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Redmi 15C 5G

Updated On : November 28, 2025 / 7:49 PM IST

Redmi 15C 5G : రెడ్‌మి అభిమానులకు అదిరిపోయే న్యూస్.. అతి త్వరలోనే భారత మార్కెట్లోకి కొత్త రెడ్‌మి 15C 5G ఫోన్ లాంచ్ కానుంది. వచ్చే డిసెంబర్ ప్రారంభంలో ఈ ఫోన్ దేశీయ మార్కెట్లోకి రావొచ్చునని వార్తలు వస్తున్నాయి. రాబోయే ఈ రెడ్‌మి ఫోన్‌కు సంబంధించి ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. వినియోగదారులకు వారి బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేసుకోవచ్చు. చాలా తక్కువ ధరకు ఎంట్రీ-లెవల్ 5G-సపోర్ట్ ఫోన్‌గా రాబోతుంది. ఈ రెడ్‌మి 15C 5జీ ఫోన్‌ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్పెసిఫికేషన్లు, డిస్‌ప్లే :
రెడ్‌మి ఫోన్‌లో HD+ రిజల్యూషన్-టైప్ 6.9 డిస్‌ప్లే ఉండొచ్చు. 120Hz స్క్రోలింగ్, బ్రౌజింగ్, వీడియోలను (Redmi 15C 5G) ఈజీగా చూడొచ్చు. అంతేకాకుండా, ఆన్‌లైన్ క్లాసులు, వీడియో కాల్స్ సాధారణంగా చేసే టాస్కులకు స్క్రీన్ పెద్దదిగా ఉంటుంది.

పర్ఫార్మెన్స్, పవర్ :
రెడ్‌మి 15c 5G ఫోన్‌లో మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్ కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌ కలిగి ఉంటుంది. దాదాపుగా లాగ్-ఫ్రీ డే-ఇన్-అవుట్ కోసం 5G సపోర్టు కలిగి ఉంది. సోషల్ నెట్‌వర్కింగ్ నుంచి లైట్ గేమింగ్ వరకు అనేక యాప్‌లను రన్ చేయొచ్చు. మల్టీ టాస్కింగ్ కోసం 8GB ర్యామ్ వరకు అందించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15లో హైపర్‌ఓఎస్‌ రన్ అవుతుందని అంటున్నారు. సాఫ్ట్‌వేర్ పరంగా అత్యంత వేగంగా ఉంటుందని భావిస్తున్నారు.

బ్యాటరీ బ్యాకప్ :
ఈ రెడ్‌మి ఫోన్ 6000mAh బ్యాటరీ కలిగి ఉంది. సాధారణ రోజువారీ వినియోగానికి భారీ బ్యాటరీని కలిగి ఉంది. వీడియోలను చూడటం, చాట్ చేయడం లేదా వెబ్‌లో గంటల తరబడి బ్రౌజ్ చేయడం ద్వారా మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ అయిపోగానే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు.

Read Also : Pensioners Alert : పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. నవంబర్ 30లోపు ఈ 3 పనులు పూర్తి చేయండి.. లేదంటే.. మీకు పెన్షన్ రాదు.. ఏం చేయాలంటే?

కెమెరా ఫీచర్లు :
రెడ్‌మి 15C 5G ఫోన్ కెమెరా ఫీచర్లలో బ్యాక్ సైడ్ 50MP కెమెరా ఉంది. సెల్ఫీలు లేదా ఇతర వీడియో కాల్స్ కోసం 8MP కెమెరా సరిపోతాయి. సోషల్ మీడియా పోస్ట్‌ల కోసం ఈ కెమెరాలను ఉపయోగించవచ్చు.

భారత్‌లో రెడ్‌మి 15C 5G ధర, స్పెసిఫికేషన్లు (అంచనా) :

భారత మార్కెట్లో రెడ్‌మి 15C 5G ధర, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్‌తో బేస్ వేరియంట్ ధర రూ. 12,499గా ఉంటుందని సమాచారం. 6GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 13,999గా ఉంటుందని, టాప్-ఆఫ్-ది-లైన్ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ. 14,999గా లాంచ్ కావచ్చని అంచనా.

ఈ ఫోన్ చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటుంది. రెడ్‌మి 15C 5G ఫోన్ మంచి సైజు డిస్‌ప్లే స్క్రీన్‌లు, బిగ్ బ్యాటరీ లైఫ్, ప్రాథమిక పర్ఫార్మెన్స్ ఫంక్షన్‌లతో అతి తక్కువ బడ్జెట్ ధరలో లభ్యంకానుంది. విద్యార్థులు లేదా ఆన్‌లైన్ లెర్నర్స్ సాధారణ యూజర్లు లేదా మొదటిసారి 5Gకి అప్‌గ్రేడ్ అయ్యే యూజర్లకు అద్భుతమైన ఫోన్ అని చెప్పొచ్చు.

రెడ్‌మి 15C 5G ఫోన్ తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 5G సపోర్ట్, బిగ్ స్క్రీన్, అద్భుతమైన బ్యాటరీ, ఈజీ ఫంక్షన్లు, కెమెరా పుట్-అవుట్ ఎక్స్‌పీరియన్స్ వంటివి ఉండొచ్చు.