Marriage Age: 21 ఏళ్ల పెళ్లి వయస్సు..బిల్లు పాస్ అయ్యేలోపు హడావిడిగా వందలాది పెళ్ళిళ్లు..

అమ్మాయిల వివావహ వయస్సును 18 నుంచి21 ఏళ్లు పెంచింది ప్రభుత్వం. ఈ బిల్లు చట్టం అయ్యేలోపు ఇప్పటికే పెళ్లిళ్లు కుదుర్చుకున్నవారు బిల్లు పాస్ అయ్యేలోగా పెళ్ళిళ్లు చేసేసుకుంటున్నారు.

Marriage Age: 21 ఏళ్ల పెళ్లి వయస్సు..బిల్లు పాస్ అయ్యేలోపు హడావిడిగా వందలాది పెళ్ళిళ్లు..

Marriage Age 21 In India

Marriage Age 21 in India : అమ్మాయిల చట్టబద్ధమైన వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై విమర్శలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. లోక్‌సభ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి నివేదించింది. పురుషులతో సమానంగా మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతూ చట్టాలను సవరిస్తూ రూపొందించిన బిల్లును మంగళవారం (డిసెంబర్ 21,2021) కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీ సభలో ప్రవేశపెట్టారు. కనీస వివాహ వయసును పెంచడం ద్వారా బాల్య వివాహాలకు అడ్డుకట్టవేయొచ్చని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ ఆలోచనతోనే దీన్ని చట్టం చేయాలని నిర్ణయించింది.

Read more : Marriage Age: కేంద్రం సంచలన నిర్ణయం.. అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే 21ఏళ్లు దాటాల్సిందే!

దీనిపై విమర్శలు..సమర్థింపులతో కొనసాగుతున్న క్రమంలో ఓ వింత పరిస్థితి నెలకొంది.అదేమంటే..ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే..అమ్మాయిలకు కచ్చితంగా 21 ఏళ్లు వస్తేనే పెళ్లి చేయాలి. లేదంటే చట్టాన్ని అతిక్రమించినట్లే. ఇటువంటి పరిస్థితుల్లో ఓ వింత పరిస్థితి వచ్చిపడింది. అదేమంటే ఇప్పటికే పెళ్లిళ్లు కుదుర్చుకుని..పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నవారు గందరగోళంలో పడ్డారు. ఆందోళనలో పడ్డారు.పెళ్లి పీటలు ఎక్కే సమయంలో బిల్లు పాస్ అయితే ఎలా? వివాహ దృవీకరణలో వారు చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. అది ఆ జంటకు చాలా ఇబ్బంది. ఇటువంటి సంకటపరిస్థితి రాకుండా హడావిడిగా మూడు ముళ్లు వేయించేస్తున్న పరిస్థితి వచ్చిపడింది.

Read more : Marriage Age : 18 ఏళ్లకే ఓటేస్తున్నారు..అదే వ‌య‌స్సులో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?

తాజాగా భారీగా పెరిగిన వివాహాల సంఖ్యే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. బిల్లు చట్టరూపం దాల్చితే వివాహం చేయడం చట్టరీత్య నేరమవుతుందన్న ఆందోళనతో 18 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న మహిళల వివాహాలు ఉన్నఫళంగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నాట్లుగా వివాహాల రిజస్ట్రేషన్ లెక్కలు చూస్తే తెలుస్తోంది.

Read more : Dwarves Village : ఆ గ్రామంలో అందరు మరుగుజ్జులే..ఇదేం శాపమోనని వాపోతున్న ప్రజలు

తాజాగా నమోదైన వివరాల ప్రకారం.. డిసెంబర్‌ 18-19ల మధ్య హర్యానాలోని మెవాట్‌ ప్రాంతంలో ఏకంగా 450 వివాహాలు జరిగాయి. వీటిలో కేవలం 180 వివాహాలు మాత్రమే అంతకు ముందు ప్లాన్‌ చేసుకున్నవి. డిసెంబర్‌ 17 ఒక్కరోజే గురుగ్రామ్‌లో 20 మంది జంటలు వివాహం కోసం కోర్టులో ఆర్జీ పెట్టుకున్నారు. సాధారణంగా రోజులో కేవలం 5 నుంచి 6 పెళ్లిళ్లు మాత్రమే జరుగుతాయి. ఇక సాధారణంగా దేవాలయాల్లో 5 నుంచి 7 వివాహాలు జరుగుతుండగా గత శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 55 వివాహాలయ్యాయి.

ఇక చాలా మంది పేరెంట్స్‌ తమ పిల్లలకు వివాహాన్ని చేసేందుకు సంబంధలు చూడడం ప్రారంభించారని తెలుస్తోంది. విద్యాభ్యసం మధ్యలో ఉన్న తమకు ఉన్నపలంగా పెళ్లి సంబంధాలు ఫిక్స్‌ చేస్తున్నట్లు కొందరు అమ్మాయిలు వాపోతున్నారు. ఒక్క మేవాట్‌ ప్రాంతంలోనే గత గడిచిన వారాంతంలో 500 వివాహాలు జరగడం గమనార్హం. వీరిలో మెజారిటీ అమ్మాయిల వయసు 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండడం కొత్త చర్చకు దారి తీస్తోంది.