Telangana Corona : థర్డ్ వేవ్‌‌కు సంకేతం ఇదే…అప్రమత్తంగా ఉండాలి

డెల్టా వేరియంట్ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని, అయినా..ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రతొక్కరూ కరోనా నిబంధనలు తు.చ.తప్పకుండా...

Telangana Corona : థర్డ్ వేవ్‌‌కు సంకేతం ఇదే…అప్రమత్తంగా ఉండాలి

Ts Dh Srinivasarao

Corona Third Wave : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి..వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు కీలకం…థర్డ్ వేవ్ కు సంకేతం ఇదే అంటూ హెచ్చరించారు తెలంగాణ ప్రజారోగ్యశాఖ సంచాలకులు(DH) శ్రీనివాసరావు. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ విస్తరిస్తోందని..భారతదేశంలో కూడా ఈ కేసులు అధికమౌతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా గత రెండు, మూడు రోజులుగా ఎక్కువయ్యాయన్నారు. త్వరలోనే భారీగా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. కరోనా ఉధృతి, ఒమిక్రాన్ వైరస్ కేసులు నమోదవుతుండడంపై ఆయన 2021, డిసెంబర్ 30వ తేదీ గురువారం మీడియాతో మాట్లాడారు.

Read More : Jinnah Tower in Guntur: గుంటూరులోని జిన్నా టవర్‌ను కూల్చేయాలి..లేదంటే మేమే ఆ పనిచేస్తాం: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

డెల్టా వేరియంట్ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని, అయినా..ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రతొక్కరూ కరోనా నిబంధనలు తు.చ.తప్పకుండా పాటించాలని, మాస్క్, భౌతిక దూరం..వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా..ఒమిక్రాన్ నుంచి రక్షించుకోవచ్చన్నారు. అయినా..ఒమిక్రాన్ సోకిన వారిలో 90 శాతం మందికి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని తెలిపారు. ప్రజలు ఆందోళనకు గురి కావద్దు. కానీ అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ తెలిపారు.

Read More : Election Commission: షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఈసీ ప్రకటన!

మరోవైపు..ఫిబ్రవరి కాదు జనవరి మధ్యలోనే థ‌ర్డ్‌వేవ్‌ మొద‌ల‌వుతుంద‌ని కేంబ్రిడ్జ్‌ హెచ్చరించింది. దేశ వ్యాప్తంగా ఇన్‌ఫెక్షన్ రేటు వేగంగా పెరుగుతున్నట్టు గుర్తించారు పరిశోధకులు. డిసెంబరు 24 నాటికి ఆరు రాష్ట్రాల్లో వైరస్ ఆందోళనకరంగా ఉండగా.. వైరస్ రేటు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు ట్రాకర్ ద్వారా గుర్తించారు. అయితే అది డిసెంబరు 26 నాటికి 11 రాష్ట్రాలకు వ్యాపించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే థర్డ్‌వేవ్‌కు మరో 10-15 రోజులే సమయముంది.