Bhopal Lovers : ప్రియుడితో బైకుపై చెల్లి చెట్టాపట్టాల్.. సినీ ఫక్కీలో అన్న చేజింగ్.. వీడియో వైరల్!

Bhopal Lovers : ప్రియుడితో బైకుపై చెల్లి తిరుగుతోందని తెలిసిన అన్నకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎలాగైనా వారిని పట్టుకోవాలని అనుకున్నాడు.

Bhopal Lovers : ప్రియుడితో బైకుపై చెల్లి చెట్టాపట్టాల్.. సినీ ఫక్కీలో అన్న చేజింగ్.. వీడియో వైరల్!

Bhopal Lovers Lovers Injured After Being Girl Brother Chased In Bhopal

Bhopal Lovers : ప్రియుడితో బైకుపై చెల్లి తిరుగుతోందని తెలిసిన అన్నకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎలాగైనా వారిని పట్టుకోవాలని అనుకున్నాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న సోదరి ఎక్కడికి వెళ్తుంది.. ప్రియుడితో ఏం చేస్తుందో గమనించడం మొదలుపెట్టాడు. ప్రియుడితో కలిసి బైకుపై వెళ్తున్న చెల్లిని చూసి ఆవేశంతో ఊగిపోయాడు అన్న.. అంతే.. వారిని నడిరోడ్డుపైనే ఆపేందుకు ప్రయత్నించాడు. ఇంతలో బైక్ వేగం పెంచి తప్పించుకున్నారు. దాంతో అన్న సినీఫక్కీ మాదిరిగా వారిద్దరిని పట్టుకునేందుకు మినీ ట్రక్కుతో ఛేజింగ్ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న వారి బైకును వెనుక నుంచి వేగంగా మినీ ట్రక్కుతో ఢీకొట్టాడు.

ఈ ఘటనలో ప్రియుడు సహా యువతికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ అయోధ్యనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన సోదరి ప్రియుడితో కలిసి బైకుపై వెళ్లడాన్ని గమనించిన అన్న కోపంతో రగిలిపోయాడు. తన చెల్లి మరొకరితో అలా తిరగడాన్ని అన్న అజీం మస్సూరీ జీర్ణించుకోలేకపోయాడు. వారి బైకును మినీ ట్రక్కుతో ఫాలో అయ్యాడు. అతన్ని గమనించిన వారిద్దరూ బైకును మరింత వేగాన్ని పెంచారు. అంతే… అజీం మరింత రెచ్చిపోయాడు. రోడ్డుపై బైకును ఛేజింగ్ చేస్తూ ట్రక్కుతో బలంగా ఢీకొట్టాడు.

బైకుతో పాటు చెల్లి, ఆమె ప్రియుడిని పది మీటర్ల దూరం వరకు ట్రక్కుతో ఈడ్చుకెళ్లాడు. అప్పటికి అతడి ఆగ్రహం చల్లారలేదు.. ట్రక్కులో నుంచి కిందికి దిగి.. సోదరి, ఆమె ప్రియుడిపై దాడి చేశాడు. ఆ తర్వాత అజీం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. అజీం దాడిలో గాయపడిన వారిద్దరిని అక్కడి వారు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దాడి అనంతరం బాధితులు ఇద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు పోలీసులు నిందితుడు అజీంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : Lovers Suicide : పెళ్లైన ఆటో డ్రైవర్‌తో బాలిక ప్రేమ.. ఆర్టీసీ బస్సులో ఆత్మహత్యాయత్నం