Lovers Suicide : పెళ్లైన ఆటో డ్రైవర్‌తో బాలిక ప్రేమ.. ఆర్టీసీ బస్సులో ఆత్మహత్యాయత్నం

భద్రాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. చంద్రుగొండ మండలానికి చెందిన ప్రేమజంట పురుగుల మందు తాగి ఆర్టీసీ బస్సు ఎక్కారు.

10TV Telugu News

Lovers Suicide : భద్రాద్రి జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. చంద్రుగొండ మండలానికి చెందిన ప్రేమజంట పురుగుల మందు తాగి ఆర్టీసీ బస్సు ఎక్కారు. అశ్వారావుపేట దగ్గరికి వచ్చేసరికి వారిని గమనించిన కండక్టర్, డ్రైవర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మండ‌లం సీతాయిగూడెం గ్రామానికి చెందిన పొర్రొళ్ల జ‌గ్గారావు (28) ఆటో డ్రైవర్. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గ్రామానికి చెందిన ప‌లువురు విద్యార్థులు జ‌గ్గారావు ఆటోలో చంద్రుగొండ జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠ‌శాల‌కు ప్రతిరోజూ రాకపోకలు కొనసాగించేవారు. ఈ క్రమంలో జ‌గ్గారావుకి అనూష(14) అనే విద్యార్థినితో ప‌రిచ‌యం ఏర్పడింది. అది కాస్తా ప్రేమ‌గా మారింది.

Eyes : నిద్రలేవగానే రెండు అరచేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటే ఏమౌతుంది?

ఏం జరిగిందో కానీ, ఇద్దరూ పురుగుల మందు తాగి కొత్తగూడెం ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సు పోలీస్ స్టేషన్ సమీపానికి వచ్చే సరికి.. ఇద్దరికి నురగలు రావటాన్ని గమనించిన ప్రయాణికులు షాక్ తిన్నారు. వెంటనే వారు ఈ విషయాన్ని కండక్టర్, డ్రైవర్‌కు చెప్పారు. దీంతో వారు అశ్వారావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో బస్సులోనే ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై దర్యాఫ్తు చేస్తున్నారు.

×