Eyes : నిద్రలేవగానే రెండు అరచేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటే ఏమౌతుంది?

దీని కూడా ఓ పురాతన చరిత్ర ఉంది. అర చేతులు రుద్దుకుని చూసేటప్పుడు.. బ్రహ్మ రాసిన చేతిగీతలు అనుకోకుండ మనం చూడడం జరుగుతుంది.

Eyes : నిద్రలేవగానే రెండు అరచేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటే ఏమౌతుంది?

Wake Up

Eyes : నిద్రలేవగానే ఒక్కోక్కరు ఒక్కో అలవాటును పాటిస్తుంటారు. నిద్రలేవగానే అరచేతులు చూడటం, దేవుని చిత్రాలు చూడటం, భార్య మొఖం చూడటం వంటివి చేస్తుంటారు. అలాగే నిద్రలేవగానే రెండు అరచేతులు రుద్దుకొని కళ్ళకు అద్దు కోవటం చూస్తుంటాం. ఇలా చేయటం వల్ల చేతుల్లో పుట్టిన వేడి కళ్ళకు తగలడం వలన కళ్ళ లో రక్త ప్రసరణ బాగా జరిగి ఆరోగ్యవంతంగా, కాంతి వంతం గా ఉండడం తో పాటు నిద్ర మత్తు వెంటన్నే వదిలిపోతుంది. ఇలా చేయడం వలన కంటి జబ్బులు కూడా రావు . కళ్ళ అద్దాల అవసరము కూడా అంత త్వరగా ఉండదు . ఇది మన పెద్దలు చెప్పిన మాటమాత్రమే కాదు వైద్యశాస్త్రము సూచించిన ఆరోగ్యసూత్రము..

టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందని పురాతన కాలంలో ఋషులు , మును లు ఎన్నో అరోగ్య సూత్రాలను రూపొందించి మానవాళి శ్రేయస్సుకోసం అందించారు. ఆ కాలములోనే శుచి , శుబ్రత , వ్యాధినిరోదకత ఇవన్నీ దైవకార్యాలరూపములో చేసేవిధంగా దిశ నిర్దేశం చేసారు. పుణ్యం తో పాటు పురుషార్ధం వస్తుందంటేనే సామాన్యప్రజలు వీటిని అనుసరిస్తారు. నిద్ర లేవగానే అర చేతులు రుద్ది కళ్ళకు పెట్టుకోమని మన పెద్దలు సూచించిందే..

దీని కూడా ఓ పురాతన చరిత్ర ఉంది. అర చేతులు రుద్దుకుని చూసేటప్పుడు.. బ్రహ్మ రాసిన చేతిగీతలు అనుకోకుండ మనం చూడడం జరుగుతుంది. ఇలా జరగడం వలన బ్రహ్మను పూజించిన ఫలితం కలిగి , బ్రహ్మజ్ఞానము పొందుతారని, ఇలా ప్రతిరోజూ చేయడము వల్ల కోటి పుణ్యక్షేత్రాలు సందర్శించినంత పుణ్యము వస్తుందని పండితులు చెబుతున్నారు. .. లేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీప్రసన్నం కలుగుతుంది. మన చేతిలోనే లక్ష్మీదేవి కొలువుంటుంది. అలాగే నిద్ర లేవగానే భూదేవికి నమస్కారం చేయాలి. మనం చేసే పనులకు సాక్ష్యమే కాదు వాటినికి ఆ మాత భరిస్తుంది కాబట్టి. ముందుగా ఆమెకు నమస్కరించి మంచం మీద నుంచి కాలు కిందకు పెట్టాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మిదేవి అనుగ్రహం సైతం కలుగుతుందని నమ్ముతారు. ఇలా చేయటం వెనుక ఆరోగ్యము దాగి ఉందన్న విషయాన్ని గ్రహించాలి.