Extra Marital Affair : 17 ఏళ్ల బాలుడితో 28 ఏళ్ల మహిళ వివాహేతర సంబంధం

క్షణికమైన కోరికలు...వివాహేతర సంబంధాలు... ఆ సమయంలో ఆనందాన్ని, సుఖాన్ని ఇచ్చినా కాలక్రమేణా వాటి వల్ల అనర్ధాలే జరుగుతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం.

Extra Marital Affair : 17 ఏళ్ల బాలుడితో 28 ఏళ్ల మహిళ వివాహేతర సంబంధం

Extra Matiral Affair

Extra Marital Affair :  క్షణికమైన కోరికలు…వివాహేతర సంబంధాలు… ఆ సమయంలో ఆనందాన్ని, సుఖాన్ని ఇచ్చినా కాలక్రమేణా వాటి వల్ల అనర్ధాలే జరుగుతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. బెంగుళూరులోని  బనశంకరిలో హత్యకు గురైన 28 ఏళ్ల లేడీస్ టైలర్ హత్యకేసులో నిందితుడు 17 ఏళ్ల ఆమె ప్రియుడే అని తేలింది.

బనశంకరి,  యారబ్ నగర్ లో   అఫ్రినా ఖానం(28) అనే వివాహిత మహిళ లేడీస్ టైలర్ గా  షాపు నడుపుకుంటోంది. ఆమె భర్త లాలూ ఖాన్ టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. వారికి 3,5 ఏళ్లు వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరూ వారి అమ్ముమ్మ ఇంటివద్ద పెరుగుతున్నారు.  అఫ్రినా ఇంటిపక్కనే వారి బంధువులు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు.

పీయూసీ చదివే ఆ బంధువుల అబ్బాయి (17)  కొత్త ఇంటి పనులు పర్య వేక్షిస్తున్నాడు. అక్కడికి వచ్చి వెళ్లే  క్రమంలో అఫ్రినా ఇంటికి కూడా వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అఫ్రినాకు, ఆ విద్యార్ధికి మధ్య పరిచయం పెరిగింది. అది ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. విద్యార్ధి ఇంటికి వచ్చిన క్రమంలో ఇంట్లో ఎవరూ లేక పోవటంతో వారిద్దరూ కొన్నిసార్లు సన్నిహితంగా మెలిగారు.

కొన్నాళ్లకు  భార్య ప్రవర్తనపై   భర్త లాలూఖాన్‌కు  అనుమానం వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు భరించలేని  అఫ్రినా …. మనిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లి హాయిగా, ఆనందంగా జీవిద్దామని ఆ విద్యార్ధిని కోరింది. అందుకు అతడు నిరాకరించాడు.  ఎక్కడికైనా లేచిపోయి బతుకుదామనే  విషయమై ఆమె అతడ్ని ఒత్తిడి చేయసాగింది.

Also Read : Satyapal Malik : గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..రెండు ఫైల్స్ పై సంతకం పెడితే రూ.300కోట్లు ఇస్తామన్నారు

అదీగాక లేడీస్ టైలర్ గా పని చేస్తున్న ఆమెను కొన్ని సార్లు డబ్బు లివ్వాలని విద్యార్ధి కోరాడు. ఈ క్రమంలో మంగళవారం అక్టోబర్ 19వ తేదీనాడు విద్యార్ధి అఫ్రినా ఇంటికి వచ్చాడు. అప్పడు వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో విద్యార్ధి అఫ్రినాను కత్తెరతో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఆమెపై దుప్పట్లు వేసి వాటికి  నిప్పు పెట్టి పరారయ్యాడు.

లేడీస్ టైలర్ ఇంట్లోంచి పొగలు రావటం గమనించిన చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అఫ్రినా శవం మంచంపై సగం కాలిన స్ధితిలో ఉంది. వెంటనే వారు పోలీసులకు, ఆమె భర్తకు, పుట్టింటికి సమచారం తెలిపారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భర్త విద్యార్ధి గురించి చెప్పాడు.  దీంతో పోలీసులు విద్యార్ధిని అదుపులోకి తీసుకుని పశ్నించగా నిజం ఒప్పుకున్నాడు.