Satyapal Malik : గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..రెండు ఫైల్స్ పై సంతకం పెడితే రూ.300కోట్లు ఇస్తామన్నారు

మేఘాలయ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్ లోని ఝున్ ఝునులో జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్ మాట్లాడుతూ...తాను జమ్ముకశ్మీర్​ గవర్నర్​గా ఉన్న సమయంలో

Satyapal Malik : గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..రెండు ఫైల్స్ పై సంతకం పెడితే రూ.300కోట్లు ఇస్తామన్నారు

Satyapal

Satyapal Malik  మేఘాలయ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్ లోని ఝున్ ఝునులో జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్ మాట్లాడుతూ…తాను జమ్ముకశ్మీర్​ గవర్నర్​గా ఉన్న సమయంలో(ఆగస్టు 2018 నుండి అక్టోబర్ 2019) ఓ వ్యాపారవేత్త సహా ఆర్ఎ​స్ఎస్​తో అనుబంధం ఉన్న వ్యక్తి(పీడీపీ-బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన వ్యక్తి)కి చెందిన రెండు ఫైల్స్ పై సంతకాలు పెడితే ఒక్కో ఫైల్ పై 150 కోట్ల రూపాయల చొప్పున రెండు ఫైల్స్ కి కలిపి రూ.300 కోట్లు వస్తాయని కార్యదర్శలు చెప్పారని తెలిపారు.

తాను కేవలం ఐదు కుర్తా-ఫైజమాలతో కశ్మీర్ వచ్చానని..వాటితోనే తిరిగా వెళ్లిపోతానని తన కార్యదర్శులకు అప్పుడు చెప్పానని మాలిక్ తెలిపారు. అయితే ఆ రెండు ఫైల్స్ లో స్కామ్ ఉందని తెలిసి.. ఒత్తిళ్లకు తలొగ్గకుండా వాటిని తిరస్కరించానన్నారు. అవసరమైతే పదవిని వీడేందుకు ఆ సమయంలో సిద్ధపడ్డాను అని మాలిక్‌ వెల్లడించారు. ఈ అవినీతి వ్యవహారాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తన నిర్ణయాన్ని సమర్ధించారన్నారు. అవినీతి విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని మోదీ తనతో అన్నారని మాలిక్ తెలిపారు. మాలిక్‌ ప్రసంగ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే తిరస్కరించిన ఆ రెండు ఫైల్ ఏంటివనేది గవర్నర్ సత్యపాల్ మాలిక్ వివరించలేదు. అయితే 2018 అక్టోబర్ లో..ప్రభుత్వ ఉద్యోగులకు,పెన్షనర్లకు మరియు అక్రిడిటెడ్ జర్నలిస్టులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం- అనీల్ అంబానికి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్య్యూరెన్స్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని గవర్నర్ హోదాలో మాలిక్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఏదో పొరపాటు ఉందని పేర్కొంటూ మాలిక్ ఈ ఒప్పందాన్ని అప్పట్లో రద్దు చేశారు. ఈ కాంట్రాక్ట్ రద్దు చేసిన రెండు రోజుల తర్వాత..అసలు ఈ మొత్తం వ్యవహారం పారదర్శక పద్ధతిలో మరియు న్యాయ పద్థతిలో జరిగిందో లేదా చూడాలని ఈ విషయాన్ని ఏసీబీ దృష్టికి తీసకెళ్లారు మాలిక్.

ఇక,కొత్తగా నియమితులైన అధికారులకు ఒత్తిడికి గురికావద్దని మరియు సమాజ శ్రేయస్సు కోసం నిజాయితీగా పని చేయాలని రాజస్తాన్ కార్యక్రమంలో సలహా ఇచ్చారు సత్యపాల్ మాలిక్. స్థిరంగా మరియు నిజాయితీగా ఉంటే ఎవరితోనైనా పోరాడవచ్చన్నారు. తన జీవితంలో ఎన్నడూ అవినీతితో రాజీ పడలేదని మాలిక్‌ తెలిపారు. తనకు రిటైర్మెంట్ తర్వాత నివసించడానికి సొంత ఇళ్లు లేదని..కానీ నాకు ఇళ్లు లేదే అనే ఎలాంటి ఆందోళన తనకు లేదన్నారు. తాను ఎమ్మెల్యే,ఎంపీగా,కేంద్రమంత్రిగా పనిచేశానని..కానీ రాజస్తాన్ కు చెందిన చాలామంది డబ్బున్నవాళ్లు తన ప్లేస్ కి వచ్చి..తన చిన్న వసతిని చూసి ఆశ్చర్చపోతుండేవారని మాలిక్ గుర్తుచేసుకున్నారు.

ALSO READ Somireddy: టీడీపీ ఆఫీస్‌పై దాడికి సంబంధించిన ఆధారాలివే.. పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?