Honor Killing : ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. గర్భవతని కూడా చూడకుండా..

సైరత్ సినిమా చూసే ఉంటారు కదా.. పరువు కోసం తోడబుట్టిన సోదరినే అత్యంత దారుణంగా హత్య చేస్తాడు సోదరుడు.

Honor Killing : ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. గర్భవతని కూడా చూడకుండా..

Aurangabad

Honor Killing : సైరత్ సినిమా చూసే ఉంటారు కదా.. పరువు కోసం తోడబుట్టిన సోదరినే అత్యంత దారుణంగా హత్య చేస్తాడు సోదరుడు. ఇటువంటి ఘటనే మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది. కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. కొడుకుతో కలిసి దారుణంగా హత్యచేసింది తల్లి.. వివరాల్లోకి వెళితే.. కీర్తి థోర్ అనే యువతి ఆరు నెలల క్రితం ప్రేమించిన యువకుడితో ఇంట్లోంచి వెళ్ళిపోయి గుడిలో పెళ్లి చేసుకొని విర్గాన్ పోలీస్ స్టేషన్‌లో పరిధిలో నివాసం ఉంటున్నారు. అయితే కూతురు ప్రేమ వివాహం తల్లి శోభా సంజయ్ మోతేకి నచ్చలేదు. కూతురిపై కక్ష పెంచుకుంది.. ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం కూతురుకి ఫోన్ చేసి చూడాలనిపిస్తుందంటూ మాయమాటలుచెప్పి కూతురు ఇంటి అడ్రస్ తెలుసుకుంది.. అనంతరం ఆమె ఇంటికి వెళ్లి ఎప్పటిలానే మాట్లాడింది.. వచ్చే వారం తమ్ముడు సంకేత్ సంజయ్ మోతే తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయింది.

చదవండి : Double Murder Case : టంగుటూరు జంట హత్యల కేసులో పురోగతి

శోభా సంజయ్ మోతే ఆమె కుమారుడు, సంకేత్ సంజయ్ మోతే ఆదివారం కూతురి ఇంటికి వచ్చారు. పొలం పనిలో బిజీగా ఉన్న కూతురు తల్లి, సోదరుడి చూసి పరుగుపరుగున ఇంటికి వచ్చింది. కాళ్లకు నీళ్లిచ్చి వంటగదిలోకి వెళ్లి టీ పెడుతుండగా.. తనతో మాటలు కలిపారు. సోదరి గర్భవతి అని కూడా చూడకుండా వెంట తెచ్చుకున్న కొడవలితో తల నరికేశాడు తమ్ముడు సంకేత్ సంజయ్ మోతే.. వంటగది నుంచి శబ్దం రావడంతో వేరేగదిలో ఉన్న కీర్తి థోర్ భర్త పరుగున వచ్చి చూడగా అప్పటికే తల్లి, కుమారుడు, కీర్తి థోర్ తల మొండెం వేరు చేశారు.

చదవండి : Professor Murders His family: ఒమిక్రాన్ భయంతో భార్య, పిల్లలను కిరాతకంగా హత్య చేసిన ప్రొఫెసర్

ఇదే సమయంలో ఆమె భర్తపై దాడికి యత్నించడంతో అతడు తప్పించుకొని పారిపోయాడు. శోభా, సంకేత్ సంజయ్, కీర్తి థోర్ తలతో సెల్ఫీలు దిగి ఆమె తలను చుట్టుపక్కల వారికి చూపిస్తూ కేకలు వేశారు. అనంతరం విర్గాన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయారు. పరువు హత్యతో ఔరంగాబాద్ జిల్లా ఉలిక్కిపడింది. సైరత్ సినిమాను తలపించేలా ఉన్న ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది.