Double Murder Case : టంగుటూరు జంట హత్యల కేసులో పురోగతి

ప్రకాశం జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన జంట హత్యలు కలకలం రేపుతున్నాయి.కొద్ది రోజుల క్రితం ఇంకొల్లు మండలంలో వృధ్ద దంపతులు హత్య, శనివారం నాడు టంగుటూరులో తల్లి కూతుళ్లు హత్యకు గురవటం సం

Double Murder Case : టంగుటూరు జంట హత్యల కేసులో పురోగతి

Mallika Garg Prakasam Sp

Double Murder Case :  ప్రకాశం జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇంకొల్లు మండలంలో వృధ్ద దంపతులు హత్య, శనివారం నాడు టంగుటూరులో తల్లి కూతుళ్లు హత్యకుగురవటం సంచలనం రేపింది.

కాగా…. ఈ హత్యలను అంత రాష్ట్ర ముఠా పనే అని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. శనివారం రాత్రి  టంగుటూరులోని జ్యూయలరీ షాపు వ్యాపారి జలదంకి రవికిషోర్‌ భార్య శ్రీదేవి(43), కుమార్తె వెంకట లేఖన(21)ల మర్డర్ కేసులో పోలీసులు కొన్ని సాక్ష్యాధారాలు సేకరించారు. మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన నలుగురు ముఠా సభ్యులే ఈ హత్యలకు ఒడిగట్టినట్లు గుర్తించిన పోలీసులు హత్యకు సంభందించిన సమాచారాన్ని షోలాపూర్ పోలీసులకు అందించారు. నలుగురు నిందితులను షోలాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

టంగుటూరులో హత్య అనంతరం అక్కడ బంగారం,నగదు దోచుకున్న దుండగులు టంగుటూరు ట్లోల్ ప్లాజా, ఒంగోలు, అద్దంకి మీదుగా హైద్రాబాదుకు చేరుకున్నారు. అక్కడి నుండి మహారాష్ట్రలోకి ప్రవేశించినట్లు పోలీసు వర్గాల గుర్తించాయి.  వీటికి సంభందించిన కీలక సీసీ పుటేజీలను సేకరించిన పోలీసులు మహారాష్ట్ర పోలీసులకు పూర్తి సమాచారం అందించారు. దీంతో షోలాపూర్ పోలీసులు ముఠా సభ్యులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

నిందితులను ఒంగోలుకు తీసుకొచ్చేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్సై స్ధాయి అధికారి‌తో కూడిన బృందం షోలాపూరుకు చేరుకుంది. నలుగురు నిందితులను ఆదివారం రాత్రికి లేదా సోమవారం ఉదయానికి ఒంగోలుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. నిందితులను గుర్తించి విచారించేందుకు ఓఎస్డీ చౌడేశ్వరీ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను కేటాయించారు ఎస్పీ మల్లికా గార్గ్.
Also Read : Shilpa Chowdary Custody : శిల్పాచౌదరిని కస్టడీ కోరుతూ మళ్లీ పిటీషన్ వేసిన పోలీసులు
ఈ కేసులో నిందితుల వేలిముద్రలు కీలకం కానున్నాయి. వేలిముద్రల విశ్లేషణ రిపోర్ట్ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు వేచి చూస్తున్నారు. ఇదే తరహాలో నవంబర్ 19న ఇంకొల్లు మండలం పూసపాడు సమీపంలో జరిగిన వృద్ద దంపతుల ధారుణ హత్య సైతం ఈ ముఠా పనేనని అనుమానిస్తున్నారు. వృద్ద దంపుతులను అతిదారుణంగా చంపి చెవులను కోసేసి బంగారు కమ్మలను దుండగలు లాక్కెళ్లారు. విలువైన బంగారు ఆభరణాలు, నగదు టార్గెట్‌గా చేసుకుని ఈ ముఠా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

జాతీయ రహదారులపై మారణ హోమం సృష్టించిన మున్నా బాయ్ తరహాలో ఈ ముఠా కూడా నేరుగా ఇళ్ళలోకి ప్రవేశించి ఇంట్లోవారిని భయబ్రాంతులకు గురిచేసి రక్తపాతాన్ని సృష్టింస్తుండటంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తల్లి, కూతుర్ల పోస్టుమార్టం పూర్తయ్యింది. కేసును చేధించేందుకు ఒక ఓఎస్డీ, ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, 8మంది ఎసైలు సహాయక సిబ్బందిని కేటాయించిన జిల్లా ఎస్పీ నియమించారు.