Shocking Video : వాకింగ్‌కు వెళ్తున్నారా? అయితే బీకేర్ ఫుల్.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి

Shocking Video : వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో వృద్ధురాలు రోడ్డుపై ఎగిరి పడిపోయింది.

Shocking Video : వాకింగ్‌కు వెళ్తున్నారా? అయితే బీకేర్ ఫుల్.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి

Shocking Video (Photo : Google)

Shocking Video – Gurugram : నడక ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు చెబుతారు. రోజూ కాసేపు నడిస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అంటారు. అందుకే చాలా మంది వాకింగ్ ను తమ డైలీ లైఫ్ లో భాగం చేసుకున్నారు. కొంతమంది ఉదయాన్నే వాకింగ్ కు వెళ్తారు. మరికొందరు సాయంత్రం వెళ్తారు. ఇంకొందరు తమకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వెళ్తారు.

నిజమే వాకింగ్ హెల్త్ కు మంచిదే. కానీ, వాకింగ్ కు వెళ్లిన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద వెళ్తున్న సమయంలో అలర్ట్ గా ఉండాలి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఒక్క క్షణం ఆగి ముందూ వెనుక చూసుకోవాలి. లేదంటే ఘోరం జరిగిపోవచ్చు. మీ ప్రాణాలే గాల్లో కలిసిపోవచ్చు. ఇందుకు నిదర్శనం హర్యానాలో జరిగిన ఘటనే.

Also Read..Robbery : అర్థరాత్రి హైవేపై ప్రయాణం చేస్తున్నారా? బీకేర్ ఫుల్.. బెంగళూరులో వెన్నులో వణుకుపుట్టించే ఘటన

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఆ తర్వాత ఆగకుండా వెళ్లిపోయింది. హర్యానాలోని గురుగ్రామ్ లో ఈ దారుణం జరిగింది.

పాలం విహార్ ఈ-బ్లాక్ కు చెందిన వృద్ధురాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో వేగంగా వచ్చిన వెర్నా కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. దీంతో వృద్ధురాలు రోడ్డుపై ఎగిరి పడిపోయింది. కారు ఆమె మెడ పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్ తర్వాత కారును ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు కారు డ్రైవర్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో చూస్తే.. ఓ పెద్దావిడ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. రోడ్డు క్రాస్ చేసే ప్రయత్నం చేసింది. ఇంతలో వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టడం, ఆమె మెడ పై నుంచి దూసుకెళ్లడం అంతా రెప్పపాటులో జరిగిపోయింది. కాగా, వృద్ధురాలిని గుద్దిన కారుని అడ్డుకునేందుకు మరో కారులో ఉన్న వ్యక్తి ప్రయత్నించాడు. తన కారుని అడ్డంగా పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ అతడు తప్పించుకున్నాడు.

Also Read..Dead Rat : బాబోయ్.. మటన్ కర్రీలో చచ్చిన ఎలుక..‍‍! ప్రముఖ రెస్టారెంట్‌లో కస్టమర్లకు ఊహించని షాక్

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. కారు నెంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. కాగా, వాకింగ్ కు వెళ్లిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు మీద ముందూ వెనుక చూసుకుని నడవాలని పోలీసులు సూచించారు.