Robbery : అర్థరాత్రి హైవేపై ప్రయాణం చేస్తున్నారా? బీకేర్ ఫుల్.. బెంగళూరులో వెన్నులో వణుకుపుట్టించే ఘటన

Robbery : అర్థరాత్రి వేళ హైవేపై ప్రయాణం చేస్తున్నారా? చాలా కేర్ ఫుల్ గా ఉండాల్సిందే. లేదంటే ఘోరం జరిగిపోవచ్చు. భారీ మూల్యం..

Robbery : అర్థరాత్రి హైవేపై ప్రయాణం చేస్తున్నారా? బీకేర్ ఫుల్.. బెంగళూరులో వెన్నులో వణుకుపుట్టించే ఘటన

Robbery (Photo : Google)

Robbery – Bengaluru-Mysuru Expressway : అర్థరాత్రి హైవేపై ప్రయాణం చేసే వారు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. మీ ప్రాణాలకే ప్రమాదం కలగొచ్చు. బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ వేపై జరిగిన ఓ ఘటన వాహనదారుల వెన్నులో వణుకు పుట్టించింది. అర్థరాత్రి ప్రయాణం చేయాలంటేనే భయపడేలా చేసింది. అసలేం జరిగిందంటే..

బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ వేపై మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘరానా దోపిడీ జరిగింది. పోలీసులం అని చెప్పుకున్న ముగ్గురు వ్యక్తులు ఓ వాహనదారుడిని దోచుకున్నాడు. అతడి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఆ గోల్డ్ చైన్ ఖరీదు అక్షరాల 3లక్షల 50వేల రూపాయలు.(Robbery)

అతడి పేరు కేకే ముత్తప్ప. కొడగు జిల్లా వాసి. ముత్తప్ప బెంగళూరు వెళ్లి తన డాక్టర్ ని కలిశాడు. తర్వాత ఇంటికి తన కారులో తిరుగు పయనం అయ్యాడు. అతడు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేసరికి బాగా చీకటి పడింది. ఇంటికి వెళ్లేందుకు కారులో బయలుదేరాడు. బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ వేలో ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఒక చోట కారు ఆపి టీ తాగాడు. మళ్లీ జర్నీ స్టార్ట్ చేశాడు.

Also Read..uttar pradesh : ప్రియురాలి కోసం భార్య ముక్కు కోసి జేబులో వేసుకెళ్లిపోయిన భర్త

కాస్త అలసటగా అనిపించడంతో మద్దూరులోని ఐశ్వర్య ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ దగ్గర కారుని ఆపాడు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు కారు దగ్గరికి వచ్చారు. మేము పోలీసులం అని వాళ్లు ముత్తప్పతో చెప్పారు. ముత్తప్ప మద్యం సేవించానో లేదో చెక్ చేయాలని చెప్పారు. దాంతో ముత్తప్ప కారు డోర్ ఓపెన్ చేశాడు. అంతే, ఒక్కసారిగా ఆ ముగ్గురు వ్యక్తులు ముత్తప్పని కారులోంచి బయటకు లాగేశారు. అతడి మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. అరిస్తే చంపుతామని బెదిరించారు. ఈ ఘటనతో ముత్తప్ప షాక్ కి గురయ్యాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు అతడి బంగారు గొలుసుతో దుండగులు ఎస్కేప్ అయ్యారు.(Robbery)

ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని దుండగులు ముత్తప్పకు వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కారులో వెళ్లిపోవాలన్నారు. నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయాక ముత్తప్ప పోలీసులకు ఫోన్ చేశాడు. కాసేటికి హైవే పోలీసులు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. సీసీటీవీ ఫుటేజీ చెక్ చేస్తున్నారు. జూన్ 30వ తేదీన తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Also Read..Uttar Pradesh: గర్ల్‭ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన అబ్బాయిని కొట్టి చంపిన కుటుంబీకులు

కాగా, ఈ ఘటనతో ముత్తప్ప బాగా భయపడిపోయాడు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అతడు. ఈ దోపిడీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది. మరోవైపు పోలీసులు వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, మరీ ముఖ్యంగా హైవేలపై ప్రయాణం చేసే సమయంలో అలర్ట్ గా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలు నిలపొద్దని పోలీసులు మరీ మరీ నొక్కి చెప్పారు.(Robbery)