Gunmen Kills 7 : బాబోయ్.. నవ్వారని, ఏడుగురిని కాల్చి చంపేశారు.. వీడియో వైరల్

ఆటలో ఓడిపోవడం చూసి నవ్వారని ఇద్దరు సాయుధులు ఏడుగురిని కాల్చి చంపిన షాకింగ్ ఘటన బ్రెజిల్ లోని సినాప్ నగరంలో జరిగింది. ప్రధాన నిందితుడు పూల్ గేమ్ ఆడాడు. ఆ గేమ్ లో మొదటిసారి ఓడిపోయాడు. దీంతో అతడు పంతం కొద్దీ రెండో గేమ్ ఆడాడు. అందులోనూ ఓడిపోయాడు.

Gunmen Kills 7 : బాబోయ్.. నవ్వారని, ఏడుగురిని కాల్చి చంపేశారు.. వీడియో వైరల్

Gunmen Kills 7 : ఆటలో గెలుపోటములు సహజం. ఆట ఏదైనా అందులో ఒకరు గెలుస్తారు మరొకరు ఓడిపోతారు. గేమ్ లో విన్ అయినా లూజ్ అయినా స్పోర్టివ్ గా తీసుకోవాలని చెబుతారు. అదే గేమ్ స్పిరిట్ కూడా. అయితే, ఆ వ్యక్తులు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. గేమ్ లో ఓటమిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కోపంతో ఊగిపోయారు. పైగా ఓడిన తమను చూసి నవ్వారని రగిలిపోయారు. అంతే, ఉన్మాదుల్లా మారారు. మమ్మల్ని చూసి నవ్వుతారా అంటూ గన్ తీసుకొచ్చి మరీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు.

ఆటలో ఓడిపోవడం చూసి నవ్వారని ఇద్దరు సాయుధులు ఏడుగురిని కాల్చి చంపిన షాకింగ్ ఘటన బ్రెజిల్ లోని సినాప్ నగరంలో జరిగింది. ఇద్దరు నిందితులు పూల్ గేమ్ ఆడాడు. ఆ గేమ్ లో మొదటిసారి ఓడిపోయారు. దీంతో పంతం కొద్దీ రెండో గేమ్ ఆడారు. అందులోనూ ఓటమే ఎదురైంది.
వరుసగా రెండు గేమ్స్ ఓడటంతో ఆ ఇద్దరిని చూసి చుట్టుపక్కల వారు నవ్వారు.

Also Read..Chicken Killed Man : OMG.. మనిషి ప్రాణం తీసిన కోడి, ఎలాగో తెలిస్తే షాక్

అసలే ఓటమి భారంతో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. వారు నవ్వడాన్ని చూసి మరింత కోపంతో ఊగిపోయారు. తమను చూసి నవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. సైకోలా మారారు. గన్ తో అక్కడికి వచ్చారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12ఏళ్ల బాలిక సహా ఏడుగురు చనిపోయారు.

బ్రెజిల్ లోని పూల్ హాల్ లో ఈ ఘోరం జరిగింది. కాల్పులు జరిపిన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. నిందితులను ఎడ్గార్ రికార్డో డి ఒలివేరా, ఎజెక్వియాస్ సౌజా రిబీరోగా పోలీసులు గుర్తించారు. దీని గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Also Read..TTE Electric Shock : బాబోయ్.. రైల్వే స్టేషన్‌లో ఊహించని ప్రమాదం, మాట్లాడుతుండగానే కరెంట్ షాక్.. వీడియో వైరల్

ప్రధాన నిందితుడు ఒలివేరా పూల్ గేమ్‌లో ఓడటంతో పాటు 4,000 రీయిస్‌తో లాస్ అయ్యాడు. దీంతో రెండోసారి గేమ్ ఆడాడు. ఈసారి కూడా ఓడిపోయాడు. రెండోసారి కూడా అతడు ఓడిపోవడంతో అక్కడ నిలబడి ఉన్న వ్యక్తుల నవ్వారు. ఇది ఒలివెరాకు తీవ్రమైన కోపం తెప్పించింది. అతను బయటకు వెళ్లి తన పికప్ ట్రక్ నుండి షాట్‌గన్‌ని తీసుకుని హాల్ లోపలికి వచ్చాడు. ఒలివేరా సహచరుడు ఎజెక్వియాస్ కూడా గన్ తో లోపలికి వచ్చాడు. అతడు.. ఆ తన పిస్టల్ తో బెదిరించి హాల్ లో ఉన్న వ్యక్తులందరినీ వరుసలో నిలబెట్టాడు.

ఆ తర్వాత ఒలివెరా కాల్పులు జరిపాడు. పూల్ యజమాని, ఇతర వ్యక్తులను కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల్లో 12ఏళ్ల బాలిక ఉంది. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు పూల్ హాల్‌లోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పోలీసులు మృతుల పేర్లను విడుదల చేశారు. లారిస్సా ఫ్రసావో డి అల్మెయిడా, ఒరిస్బెర్టో పెరీరా సౌసా, అడ్రియానో ​​బాల్బినోట్, గెటులియో రోడ్రిగ్స్ ఫ్రసావో జూనియర్, జోస్యు రామోస్ టెనోరియో, పూల్ హాల్ యజమాని మసీల్ బ్రూనో డి ఆండ్రేడ్ కోస్టా. ఏడవ బాధితుడు ఎలిజ్యూ శాంటోస్ డా సిల్వాగా గుర్తించారు. ఒక మహిళను మాత్రం ప్రాణాలతో వదిలేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నవ్వారని ఏడుగురిని గన్ తో కాల్చి చంపడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కాల్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.