Chicken Killed Man : OMG.. మనిషి ప్రాణం తీసిన కోడి, ఎలాగో తెలిస్తే షాక్

మనిషి ప్రాణం తీసిన కోడి. దాడి చేసి మరీ చంపేసింది. ఏంటి షాక్ అయ్యారా? కోడి ఏంటి? మనిషిని చంపడం ఏంటి? అని సందేహం వచ్చింది కదూ.

Chicken Killed Man : OMG.. మనిషి ప్రాణం తీసిన కోడి, ఎలాగో తెలిస్తే షాక్

Chicken Killed Man : మనిషి ప్రాణం తీసిన కోడి. దాడి చేసి మరీ చంపేసింది. ఏంటి షాక్ అయ్యారా? కోడి ఏంటి? మనిషిని చంపడం ఏంటి? అని సందేహం వచ్చింది కదూ. ఇది జోక్ అనుకుంటున్నారు కదూ. కానీ, ఇది జోక్ కాదు. నిజం. ఓ కోడి తన యజమాని పాలిటి మృత్యువైంది. ఆయనపై దాడి చేసి చంపేసింది. ఈ షాకింగ్ ఘటన ఐర్లాండ్‌లో చోటుచేసుకుంది.

ఆయన పేరు జాస్పర్ క్రాస్. వయసు 67 ఏళ్లు. ఐర్లాండ్‌లోని కిల్లాహోర్నియాలో నివాసం ఉంటారు. క్రాస్‌కు జంతువులు, పక్షులు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన తన ఇంటి ఆవరణంలో పెంపుడు జంతువులు కోళ్లు, కుక్కలు, పిల్లులు లాంటివి పెంచేవాడు. చిన్నపాటి పౌల్ట్రీని కూడా నిర్వహిస్తున్నాడు. వాటి సంరక్షణను క్రాస్‌ స్వయంగా చూసుకునేవాడు. క్రాస్‌ ఇంట్లో బ్రహ్మ కోడి కూడా ఉంది. ఆ బ్రహ్మ కోడి చాలా దూకుడుగా ఉండేది.

Also Read..Heart Attack : షాకింగ్.. భోజనం చేస్తూ గుండెపోటుతో మృతి, వీడియో వైరల్

ఎప్పట్లానే జాస్పర్ క్రాస్ ఇంటి నుంచి బయటికి వెళుతుండగా.. బ్రహ్మ కోడి సడెన్ గా దాడి చేసింది. క్రాస్ కాలు వెనక భాగంలో తన కాళ్ల గోర్లతో దాడి చేసింది. దాంతో క్రాస్ కాలికి తీవ్ర రక్తస్రావం అయింది. లీటర్ల కొద్ది రక్తం పోయింది. అదే సమయంలో క్రాస్‌కు గుండెపోటు వచ్చింది. అంతే, ఆయన స్పాట్ లోనే మరణించాడు. ఈ విషయాన్ని క్రాస్‌ కుమార్తె వర్జీనియా గినాన్ (33) తెలిపింది. కాగా, ఈ కోడి గతంలో తన కుమార్తెపైనా దాడి చేసిందని ఆమె చెప్పింది.

చైనాలోని షాంఘై ప్రాంతానికి చెందిన బ్రహ్మ కోళ్లను మాంసం, గుడ్ల కోసం పెంచుకుంటారు. బ్రహ్మ చికెన్ సగటున 10-12 పౌండ్లు ఉంటుంది. దాడి చేసిన కోడి మాత్రం 18 పౌండ్ల బరువు ఉందట.

Also Read..Viral Video: సంగీత ప్రదర్శన మధ్యలో బూటులో బీరు పోసుకుని తాగిన సింగర్

దీన్ని బట్టి.. కోడి ప్రమాదకరం కాదు అని అనుకోవడానికి వీల్లేదన్నారు గినాన్. పెంపుడు జంతువు.. చిన్నదైనా, పెద్దదైనా అప్రమత్తంగా, జాగ్రత్తంగా ఉండాల్సిందే అంటున్నారు. లేదంటే, ప్రాణాలమే ప్రమాదం అని హెచ్చరించారు. కోడి దాడి చేయడంతో వ్యక్తి చనిపోయాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.