Heart Attack : షాకింగ్.. భోజనం చేస్తూ గుండెపోటుతో మృతి, వీడియో వైరల్

ఓ టోల్ ప్లాజాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వ్యక్తి హఠాత్తుగా చనిపోయాడు. ఆ వ్యక్తి టేబుల్ పై కూర్చుని భోజనం చేస్తున్నారు. ఇంతలో గుండెపోటు వచ్చింది. అంతే, అలానే కుప్పకూలిపోయాడు.(Heart Attack)

Heart Attack : షాకింగ్.. భోజనం చేస్తూ గుండెపోటుతో మృతి, వీడియో వైరల్

Heart Attack : ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఏజ్ తో సంబంధమే లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందుతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు, చివరికి యంగర్స్ సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తోంది.

ఒకప్పుడు వృద్ధులకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి మాత్రమే హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు, వయసుతో సంబంధం లేదు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారు.. ఫిట్ గా ఉండి, నిత్యం వ్యాయామం, జిమ్ చేస్తున్న వారు సైతం కార్డియాక్ అరెస్ట్ తో చనిపోతున్నారు.

Also Read..Heart Attack : ఈ లక్షణాలు కనిపిస్తే గుండె పోటుగా అనుమానించాల్సిందే?

తాజాగా మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ టోల్ ప్లాజాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వ్యక్తి హఠాత్తుగా చనిపోయాడు. ఆ వ్యక్తి టేబుల్ పై కూర్చుని భోజనం చేస్తున్నారు. ఇంతలో గుండెపోటు వచ్చింది. అంతే, అలానే కుప్పకూలిపోయాడు. బెంచి పైనుంచి కిందకి పడిపోయాడు. ఆ వెంటనే ప్రాణం పోయింది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.(Heart Attack)

కాగా, ఇటీవలి కాలంలో అన్ని ఏజ్ గ్రూపుల్లో మరీ ముఖ్యంగా యువతలో గుండెపోటు కామన్ గా మారడం ఆందోళనకు గురి చేస్తోంది. హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన కేసులు ఇటీవల ఎక్కువయ్యాయి. మారిన జీవవశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం.. చాలామంది గుండెపోటు బారిన పడేందుకు ప్రధాన కారణాలని డాక్టర్లు చెబుతున్నారు. మూడు పదుల వయస్సులోపు వారు కూడా హార్ట్ ఎటాక్స్ కు గురవుతుండటం ఆందోళన కలిగించే పరిణామం.

Also Read..Heart Attack : అవతార్ 2 సినిమా చూస్తున్న వ్యక్తి గుండెపోటుతో మరణం ; ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై కార్డియాలజిస్టులు ఏమంటున్నారంటే?

ఇంతకు ముందు వృద్ధులకు, జబ్బులతో బాధపడేవారికి మాత్రమే గుండెపోటు వస్తుందని నమ్మేవారు. కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలు ఇది అవాస్తవమని తేల్చేశాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా గుండెపోటుతో సడెన్ గా మరణిస్తున్నారు. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, భారతదేశంలో దాదాపు 50 శాతం గుండెపోటు కేసులు 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో.. 25 శాతం 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కనిపిస్తున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.