Heart Attack : అవతార్ 2 సినిమా చూస్తున్న వ్యక్తి గుండెపోటుతో మరణం ; ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై కార్డియాలజిస్టులు ఏమంటున్నారంటే?

దురదృష్టవశాత్తు మన దేశంలో చాలా మంది యువత గుండెపోటుకు గురవుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. గత 2 నెలల్లో గుండెపోటు కేసులు 15% నుండి 20% వరకు పెరిగాయి.

Heart Attack : అవతార్ 2 సినిమా చూస్తున్న వ్యక్తి గుండెపోటుతో మరణం ; ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై కార్డియాలజిస్టులు ఏమంటున్నారంటే?

heart attack

Heart Attack : సినిమాల్లో వాహనాలు నడుపుతూ, పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేయడం వల్ల ఆకస్మిక గుండె సంబంధిత మరణాలు వంటి సీన్లు చూస్తుంటాం. వాస్తవానికి ఇవి నిజజీవితంలో కూడా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన తమ్ముడితో కలిసి జేమ్స్ కామెరూన్ అవతార్ 2 చూస్తుండగా గుండెపోటుతో మరణించాడు. సినిమా మధ్యలో కుప్పకూలిపోయి ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందినట్లు ప్రకటించారు. అలాగే అటు, తైవాన్‌లో గతంలో 42 ఏళ్ల వ్యక్తి 2010లో విడుదలైన ‘అవతార్’ చిత్రం మొదటి భాగాన్ని చూస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. ఇకపోతే, అవతార్: ది వే ఆఫ్ వాటర్ మూవీ డిసెంబరు 2009లో విడుదలైన అవతార్‌కి సీక్వెల్. 13 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉంది. 2500 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా నిర్మించటం జరిగింది.

ఒక అధ్యయనం ప్రకారం, ఒత్తిడితో కూడిన సన్నివేశాలతో కూడిన సినిమాలను చూడటం వల్ల గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వస్తాయి. కానీ ఇది ఆకస్మిక గుండె మరణానికి కారణమవుతుందా అన్నదానికి నిపుణులు కొంత సమాచారాన్ని అందించారు. ముందునుండే ఉన్న సమస్యల కారణంగా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అవుతుండటం జరుగుతుందని వారు చెబుతున్నారు. గుండెపోటు కార్డియాక్ అరెస్ట్‌కు కారణమవుతుంది. రోగి ఆకస్మిక గుండెపోటు వల్ల మరణాలు కూడా సంభవించవచ్చు.

ముఖ్యంగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, షుగర్, భారీ ధూమపానం, ఊబకాయం, వంటి సమస్యలు ఉన్నప్పుడు ధమనులలో అడ్డుపడటం వల్ల గుండెపోటు వస్తుంది. రోజువారి వ్యాయామాలు లేకపోవటం, అకస్మికంగా బరువులు ఎత్తడం వంటి వ్యాయామాన్ని చేపడితే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత, మన రక్త నాళాలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఒత్తిడి కారణంగా,బిపి పెరగడం, గుండె ధమనులు పగిలిపోయి హఠాత్తుగా గుండె ఆగిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆకస్మిక అరిథ్మియా గుండెపోటుకు కారణమవుతుంది. ప్రమాద కారకాలు వచ్చినప్పుడు, ఇవన్నీ గుండె ధమనులలో చిన్న అడ్డంకులు ఏర్పడటానికి కారణమవుతాయి, ఇవి ఒత్తిడితో కూడిన పరిస్థితులలో గుండెపోటుకు కారణమవుతాయి. గుండెపోటు లేదా లయ ఆటంకాలు కారణంగా కూడా కార్డియాక్ అరెస్ట్ కావచ్చు.

దీనికి కొన్ని జన్యుపరమైన పరిస్థితులు కారణాలుగా చెప్పవచ్చు. తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి ఉన్నప్పుడల్లా అది రిథమిక్ ఆటంకాలను కలిగిస్తుంది. ఆకస్మిక అరిథ్మియా గుండెపోటుకు కారణమవుతుంది. కరోనరీ డిసెక్షన్ అని ఒక పరిస్థితి ఉంది. గుండెకు సరఫరా చేసే ధమనులు అకస్మాత్తుగా విచ్ఛేదనం చెందుతాయి. ఇది గుండెపోటుకు కారణమవుతుంది, ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ మరణానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆకస్మిక కార్డియాక్ డెత్ యొక్క ఇతర కారణాలు ;

ఒక రోగి అకస్మాత్తుగా మరణించినప్పుడు, దానికి అత్యంత సాధారణ కారణం ఆకస్మిక కార్డియాక్ డెత్ అని చెప్తారు. ఆకస్మిక కార్డియాక్ అనేది నిర్వచనం ప్రకారం, లక్షణాలు ప్రారంభమైన 1 గంటలోపు మరణం సంభవిస్తుంది. ఆకస్మిక మరణానికి ఇతర కారణాలు పల్మనరీ ఎంబాలిజం, పెద్ద ఇంట్రాక్రానియల్ బ్లీడ్ లేదా టాక్సిన్ ఎక్స్పోషర్, బృహద్ధమని విచ్ఛేదనం లేదా చీలిక వంటి కారణాలు ఉంటాయి.

వెంట్రిక్యులర్ టాచీకార్డియా/ఫిబ్రిలేషన్ మరణానికి దారితీసే గుండెపోటు. అంతర్లీన గుండె సమస్యలు ఉన్న వ్యక్తులు తీవ్ర ఒత్తిడి/ఉత్సాహం కారణంగా హఠాత్తుగా చనిపోవచ్చు. కరోనరీలలో ఫలకం పగిలిపోవడం వల్ల , ఉత్సాహం కారణంగా అరిథ్మియా ఏర్పడడం వల్ల జరుగుతుంది. ఈ రకమైన మరణాలు ఉత్తేజకరమైన మ్యాచ్‌లు/భావోద్వేగ పరిస్థితులలో జరుగుతాయి. అవతార్ సినిమా ప్రతి ఒక్కరి మరణానికి కారణమయ్యే అవకాశం లేదు, కాని ముందునుండి సమస్యలు ఉన్నవారిలో అలా జరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

జీవనశైలిలో మార్పులు, జన్యుపరమైన కారణాలు ;

దురదృష్టవశాత్తు మన దేశంలో చాలా మంది యువత గుండెపోటుకు గురవుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. గత 2 నెలల్లో గుండెపోటు కేసులు 15% నుండి 20% వరకు పెరిగాయి. యువకుల మరణాలకు కారణాలు గుండెపోటులు, మధుమేహం, నిశ్చల జీవనశైలి, వాయు కాలుష్యం, ఒత్తిడి, భారీ వ్యాయామం, స్టెరాయిడ్లు మొదలైనవి. భారతీయులు జన్యుపరంగా గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు పాశ్చాత్య జీవనశైలిని అవలంబించడం వల్ల గుండెపోటుకు దారితీస్తుంది.

ఒక తరహా జన్యువు భారతీయులను గుండెపోటుకు గురి చేస్తుంది. కొవిడ్ సమయంలో కూడా చాలా మంది యువకులు గుండెపోటుతో చనిపోయారు, ఎందుకంటే కోవిడ్ ఊపిరితిత్తుల వ్యాధి మాత్రమే కాకుండా గుండె పోటుతో కూడా చనిపోయారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా, తప్పనిసరిగా మధుమేహం, వంటి పరీక్షలు చేయించుకోవాలి. క్రమం తప్పకుండా ఒత్తిడి ని దూరం చేసుకోవాలి.

షుగర్ లేదా బిపి ఎక్కువగా ఉన్నా వాటికి సంబంధించిన అవగాహన చాలా మందిలో ఉండదు. ఉన్నా పెద్దగా కేర్ తీసుకోరు. మొదట్లో ఈ రెండు విషయాలు ఎటువంటి ముందస్తు లక్షణాలను ఇవ్వవు. మీ గుండె ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవడానికి, తప్పనిసరిగా ఒత్తిడి పరీక్ష, 2డి ఎకో, కొలెస్ట్రాల్ మరియు ఇసిజి పరీక్షలు చేయించుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.