Purushaha : భార్య బాధితుల పోరాటమా? పురుషః సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్..

బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది.. (Purushaha)

Purushaha : భార్య బాధితుల పోరాటమా? పురుషః సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్..

Purushaha

Updated On : November 5, 2025 / 4:56 PM IST

Purushaha : వైఫ్ వర్సెస్ వారియర్, వైఫ్ వర్సెస్ పీస్ మ్యాన్, వైఫ్ వర్సెస్ సిజర్ మ్యాన్, ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనక ఓ ఆడది ఉంటుంది, స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం.. గొప్ప గొప్ప యుద్ధాలన్నీ భార్యతోనే.. అంటూ డిఫరెంట్ క్యాప్షన్ పెట్టి సరికొత్త కాన్సెప్ట్స్ తో ఇటీవల పురుష: సినిమా ప్రీ లుక్ పోస్టర్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే..(Purushaha)

తాజాగా పురుష: సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు . బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు వులవల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు.

Also Read : Indraaniel : సీరియల్ కోసం.. రామ్ చరణ్ సినిమాని రిజెక్ట్ చేసిన నటుడు..

ఈ పోస్టర్ పై ‘బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది..’ అనే క్యాప్షన్ తో ముగ్గురు హీరోల గెటప్స్ తో ఆసక్తి నెలకొల్పారు. పోస్టర్ రిలీజ్ అనంతరం శ్రీకాంత్ ఓదెల పురుషః మూవీ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు.

Purushaha

కామెడీ సినిమాగా పురుషః తెరకెక్కనుంది. వెన్నెల కిషోర్, విటివి గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తుండగా వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

Purushaha

Also Read : Peddi Song : ‘పెద్ది’ సినిమా ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. చరణ్ స్టెప్ అదిరిందిగా.. ‘చికిరి’ అర్ధం ఏంటంటే..