Peddi Song : ‘పెద్ది’ సినిమా ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. చరణ్ స్టెప్ అదిరిందిగా.. ‘చికిరి’ అర్ధం ఏంటంటే..

తాజాగా పెద్ది సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు. (Peddi Song)

Peddi Song : ‘పెద్ది’ సినిమా ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. చరణ్ స్టెప్ అదిరిందిగా.. ‘చికిరి’ అర్ధం ఏంటంటే..

Peddi Song

Updated On : November 5, 2025 / 11:24 AM IST

Peddi Song : రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రా & రస్టిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన గ్లింప్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి.(Peddi Song)

తాజాగా పెద్ది సినిమా నుంచి మొదటి సాంగ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఇటీవల చికిరి.. చికిరి.. అంటూ ఆ పదాన్ని పెద్ది మూవీ యూనిట్ బాగా వైరల్ చేసింది. దీంతో అదేంటి అని అంతా వెతికేసారు. నేడు బుచ్చిబాబు – రెహమాన్ మాట్లాడుతూ చికిరి అనేది అమ్మాయిని వర్ణించడానికి వాడే ఒక పదం అని చెప్పి ఆ పదంతోనే పాటని చేసాం అంటూ, అది హీరో మొదటిసారి హీరోయిన్ ని చూసిన సందర్భంలో వస్తుందని చెప్పి చికిరి సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేసారు.

Also Read : Bad Girl Review : ‘బ్యాడ్ గర్ల్’ మూవీ రివ్యూ.. ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా.. ఈ జనరేషన్ అమ్మాయిల గురించా?

బుచ్చిబాబు – రెహమాన్ మాట్లాడుకుంటున్న వీడియోలోనే చివర్లో పాట ప్రోమో జత చేసారు. ఫుల్ సాంగ్ నవంబర్ 7న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో చరణ్ స్టెప్ అదిరిపోయింది. దీంతో ఈ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా 2026 మార్చ్ 27 రిలీజ్ చేస్తామని ప్రకటించారు.