Apple iPhone 16 Plus : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ భారీ డిస్కౌంట్ ధరకే.. ఇప్పుడే కొనేసుకోండి!

Apple iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో ఈ ఐఫోన్ ప్లస్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

1/5Apple iPhone 16 Plus
Apple iPhone 16 Plus : ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? మీరు ఐఫోన్ 16 ప్లస్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం అమెజాన్ ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 17,400 కన్నా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీరు కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. అమెజాన్‌లో ఐఫోన్ 16 ప్లస్ డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
2/5Apple iPhone 16 Plus
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ అమెజాన్ డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ.89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.76,490కి లిస్ట్ అయింది. ఈ-కామర్స్ దిగ్గజం ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.13,410 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.
3/5Apple iPhone 16 Plus
మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. మీ సేవింగ్ కోసం మీ పాత హ్యాండ్‌సెట్‌ను ట్రేడ్ చేయవచ్చు.
4/5Apple iPhone 16 Plus
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ OLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఆపిల్ అడ్వాన్స్ A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. IP68 రేటింగ్‌ కలిగి ఉంది. ఈ ఐఫోన్ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ అందించగలదని ఆపిల్ పేర్కొంది.
5/5Apple iPhone 16 Plus
ఫొటోగ్రఫీ పరంగా ఐఫోన్ 16 ప్లస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా కలిగి ఉంది.