Ghazala Hashmi: వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గజాలా హష్మీ గెలుపు.. ఎవరీ గజాలా.. హైదరాబాద్ తో ఉన్న అనుబంధం ఏంటి..

అట్లాంటాలోని ఎమరి వర్సిటీ నుంచి లిటరేచర్ లో పీహెచ్‌డీ చేశారు. అజహర్‌ ను పెళ్లి చేసుకున్నారు.

Ghazala Hashmi: వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గజాలా హష్మీ గెలుపు.. ఎవరీ గజాలా.. హైదరాబాద్ తో ఉన్న అనుబంధం ఏంటి..

Updated On : November 5, 2025 / 5:31 PM IST

Ghazala Hashmi: అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన లీడర్లు మెరిశారు. వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గజాలా హష్మీ గెలుపొందారు. ఆమె డెమోక్రాట్‌ లీడర్. అమెరికా రాష్ట్రాల్లో ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా గజాలా సరికొత్త రికార్డ్ సృష్టించారు. కాగా గజాలా హష్మీకి హైదరాబాద్ తో అనుబంధం ఉంది. హైదరాబాద్ తో ఆమెకున్న అనుబంధం ఏంటో తెలుసుకుందాం.

గజాలా హష్మీ రిపబ్లికన్ జాన్ రీడ్‌ను ఓడించారు. వర్జీనియా సెనేట్‌లో పని చేసిన మొదటి ముస్లిం మహిళ. అంతేకాదు మొదటి దక్షిణాసియా అమెరికన్‌గా గుర్తింపు పొందారు.

గజాలా హష్మీ పుట్టింది హైదరాబాద్ లోనే. 1964లో ఆమె జన్మించారు. ఆమె తల్లిదండ్రులు తన్వీర్, జియా హష్మీ. ఆమె బాల్యంలో మలక్‌పేట ప్రాంతంలోని తన అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం ఉన్నారు. ఆమె తల్లి తరపు తాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖలో పని చేశారు. నాలుగు సంవత్సరాల వయసులో తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా అమెరికాలోని జార్జియాకు వెళ్లిపోయారు. ఆ తర్వాత అక్కడే సెటిల్ అయ్యారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ చేశారు. గజాలా తండ్రి ప్రసిద్ధ యూనివర్సిటీలో ఉపాధ్యాయుడిగా పని చేశారు.

జార్జియా సదరన్ యూనివర్సిటీలోని మార్విన్ పిట్మాన్ లాబొరేటరీ స్కూల్‌లో గజాలా చదువుకున్నారు. అక్కడ ఆమె తండ్రి, మామ పొలిటికల్ సైన్స్ విభాగంలో బోధించే వారు. గజాలా చదువుల్లో మంతి ప్రతిభ చూపించారు. ఎన్నో స్కాలర్‌షిప్స్, ప్రోత్సాహకాలు అందుకున్నారు. జార్జియా సదరన్‌ విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్‌ చదివారు.

అట్లాంటాలోని ఎమరి వర్సిటీ నుంచి లిటరేచర్ లో పీహెచ్‌డీ చేశారు. అజహర్‌ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 1991లో రిచ్‌మండ్‌ ప్రాంతానికి మారారు. 30 ఏళ్లు అక్కడే రేనాల్డ్స్‌ కమ్యూనిటీ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. 2019లో ఆమె తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. 2024లో సెనేట్‌ విద్య, వైద్య కమిటీ ఛైర్‌పర్సన్‌గా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఎన్నికయ్యారు గజాలా.

Also Read: ఎవరీ జోహ్రాన్ మమ్దానీ..? భారత దేశంతో అతనికున్న సంబంధాలేంటి..? 34ఏళ్లకే న్యూయార్క్ మేయర్‌గా విజయం.. ట్రంప్‌కే షాకిచ్చాడు..