Ram Charan: హై ఫీవర్ లో రామ్ చరణ్ డాన్స్.. షూటింగ్ ఆపేద్దాం అన్నా ఆగలేదు.. మీ డెడికేషన్ కి
హై ఫీవర్ లో రై రై రా రా సాంగ్ చేసిన రామ్ చరణ్(Ram Charan).
Ram Charan in full fever during the shooting of the song Rai Rai rara song
- పెద్ది నుంచి రయ్ రయ్ రారా సాంగ్ విడుదల
- హై ఫీవర్ లో చరణ్ మాస్ డాన్స్
- చరణ్ పై చిరు, బుచ్చిబాబు ప్రశంసలు
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా పెద్ది సినిమా కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Manoj- Mounika: మనోజ్- మౌనికా మూడేళ్ల వైవాహిక బంధం.. స్పెషల్ ఫొటోస్
ఇదిలా ఉంటే, తాజాగా పెద్ది సినిమా నుంచి ‘రయ్ రయ్ రారా’ అనే సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఏఆర్ రెహమాన్ అందించిన బీట్, దానికి అనంత్ శ్రీరామ్ అందించిన లిరిక్స్ నెక్స్ట్ లెవల్లో సెట్ అయ్యాయి. ఇక రామ్ చరణ్(Ram Charan) చేసిన డాన్స్ కి సోషల్ మీడియాలో షేక్ అవుతోంది. జానీ మాస్టర్ కంపోజ్ చేసిన అదిరిపోయే మూమెంట్స్ రామ్ చరణ్ వేస్తుంటే చాలా అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏ సాంగ్ పై మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియాలో స్పందించాడు. రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు.
అయితే, మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ పోస్ట్ కి దర్శకుడు బుచ్చిబాబు సనా స్పందించాడు. “థ్యాంక్యూ సో మచ్ సార్. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది.. ఈ బీజీఎమ్ షూటింగ్ చేస్తున్నప్పుడు చరణ్ సర్కి హై ఫీవర్ సార్. మేము షూటింగ్ ఆపేద్దామన్నా, ఆయన ‘లేదు చేద్దాం’ అన్నారు. అంత జ్వరంలో కూడా ముఖంపై చిరునవ్వుతో, గ్రేస్తో డాన్స్ చేశారు. ఆ డెడికేషన్, ఆ యాటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే సర్.. లవ్ యు సార్’’ అంటూ తన సంతోషాన్ని తెలియజేశారు బుచ్చిబాబు. దాంతో, బుచ్చిబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే, సినిమా పట్ల రామ్ చరణ్ కి ఉన్న డెడికేషన్ పై కూడా సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక పెద్ది సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Thank you sooo much Sirrrr
❤️❤️❤️🙏🙏🙏ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది సర్, ఈ BGM షూటింగ్ చేస్తున్నప్పుడు Charan సర్కి High fever sir. మేము షూటింగ్ ఆపేద్దామన్నా, ఆయన “లేదు చేద్దాం” అన్నారు. అంత జ్వరం లో కూడా ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్తో డాన్స్ చేశారు.
ఆ డెడికేషన్, ఆ… https://t.co/QXAlEOwlGw
— BuchiBabuSana (@BuchiBabuSana) March 3, 2026
