Plane Crash : రష్యాలో కుప్పకూలిన విమానం..16మంది మృతి

రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం పారాట్రూపర్స్​తో వెళ్తున్న రష్యా యుద్ధవిమానం L-410 సెంట్రల్ రష్యాలోని తతర్​స్థాన్​ సమీపంలో కుప్పకూలింది.

Plane Crash : రష్యాలో కుప్పకూలిన విమానం..16మంది మృతి

Plane (1)

Plane Crash రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం పారాట్రూపర్స్​తో వెళ్తున్న రష్యా యుద్ధవిమానం L-410 సెంట్రల్ రష్యాలోని తతర్​స్థాన్​ సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కు తరలించారు.

ప్రమాద సమయంలో విమానంలో 22 మందికి ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ పారాచ్యూట్ జంపర్లేనని రష్యా అత్యవసర సర్వీసుల మంత్రిత్వ శాఖ తెలిపింది. శిథిలాల కింద నుంచి ఏడుగురిని సజీవంగా బయటకు తీసుకువచ్చినట్టు తెలిపింది. అయిొతే ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ప్రమాదానికి ముందు రాడార్ తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి.. తర్వాత విమానం కూలిపోగా.. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చిందని అక్కడి అధికారులు తెలిపారు.

ట్విన్ ఇంజన్ షార్ట్ రేంజ్ రవాణా విమానంగా L-410 టర్బోలెట్‌‌ను వినియోగిస్తుంటారు. రష్యా ఏవియేషన్ భద్రతా ప్రమాణాలు ఇటీవల కాలంలో మెరుగుపడినప్పటికీ పాతబడిన విమానాల వాడకం తరచూ ప్రమాదాలకు దారితీస్తోంది. ఇటీవల పాతబడిన ఆంటోనోవ్ ఎఎన్-26 రవాణా విమానం కుప్పకూలి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

ALSO READ ప్రగ్యాకి కరోనా పాజిటివ్.. టెన్షన్‌లో బాలయ్య ఫ్యాన్స్!