Delhi: కాంగ్రెస్ మహిళా నేత కారు చోరీ.. సీసీ కెమెరాలో రికార్డైన ఘటన.. సిగ్గుచేటు పని అన్న నేత

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహిళా నేతకు చెందిన ఫార్చ్యూనర్ కారు చోరీకి గురైంది. ఈ కారు చోరీ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటన సిగ్గుచేటని ఆ నేత వ్యాఖ్యానించింది.

Delhi: కాంగ్రెస్ మహిళా నేత కారు చోరీ.. సీసీ కెమెరాలో రికార్డైన ఘటన.. సిగ్గుచేటు పని అన్న నేత

Delhi: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పంఖురి పాఠక్ అనే మహిళా నేత కారు చోరీకి గురైంది. దీనికి సంబంధించిన వీడియోను పంఖురి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేసింది. గత బుధవారం రాత్రి పంఖురి తన ఎస్‌యూవీ ఫార్చ్యూనర్ కారును ఢిల్లీ, జనక్‌పురి పరిధిలోని తిహార్ జైలు సమీపంలో పార్క్ చేసింది.

Bihar: చాక్లెట్ల ఆశచూపి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి 5 గుంజీల శిక్షతో సరిపెట్టిన గ్రామ పెద్దలు

అది కూడా రోడ్డు పక్కన, ఇతర వాహనాల మధ్యలో పార్క్ చేసింది. అయితే, కొందరు దొంగలు దాదాపు అరగంటపాటు శ్రమించి అర్ధరాత్రి కారును ఎత్తుకెళ్లారు. మొదట కారు దగ్గరికి వచ్చిన దొంగలు కారు లాక్ తీసేందుకు ప్రయత్నించారు. అయితే సాధ్యపడలేదు. తర్వాత మరికొందరు టూ వీలర్‌పై వచ్చి ప్రయత్నించారు. అప్పుడూ సాధ్యం కాక వెళ్లిపోయారు. మరికాసేపట్లోనే వేరే కారులో వచ్చిన దొంగలు ఈసారి సులభంగా కారును ఎత్తుకెళ్లారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనపై పంఖురి ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

గట్టి భద్రత ఉండే తిహార్ జైలు సమీపంలోనే ఇలాంటి దొంగతనం జరిగితే, ఇక ఢిల్లీలోని మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటూ ఆమె ట్వీట్ చేసింది. ఈ ఘటన సిగ్గుచేటని వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.