Bihar: చాక్లెట్ల ఆశచూపి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి 5 గుంజీల శిక్షతో సరిపెట్టిన గ్రామ పెద్దలు

బిహార్‌లో అనాగరిక సంఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి గ్రామ పెద్దలు విధించిన శిక్ష సంచలనంగా మారింది. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష విధించి, వదిలిపెట్టారు.

Bihar: చాక్లెట్ల ఆశచూపి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి 5 గుంజీల శిక్షతో సరిపెట్టిన గ్రామ పెద్దలు

Bihar: బిహార్‌లో అనాగరిక సంఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి గ్రామ పెద్దలు ఐదు గుంజీల శిక్ష విధించి, వదిలిపెట్టారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.

Arvind Kejriwal: సీబీఐ, ఈడీ నా చేతిలో ఒక్క రోజు ఉన్నా.. సగం మంది బీజేపీ నేతలు జైలుకే: అరవింద్ కేజ్రీవాల్

బిహార్, నవాడా జిల్లాలోని ఒక గ్రామంలో అరుణ్ పండిట్ అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో ఉంటున్న ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశచూపి కోళ్లఫాంకు తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ, గ్రామపెద్దలు అడ్డుకుని పంచాయతీ నిర్వహించారు. అయితే, ఈ పంచాయితీలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకోలేదు. దీంతో అతడికి గ్రామపెద్దలు తమదైన శిక్ష విధించారు. అత్యాచారం చేశాడని ఒప్పుకోలేదు కాబట్టి.. చిన్నారిని ఎత్తుకెళ్లినందుకు మాత్రమే శిక్ష విధించారు. దీనికి నిందితుడు అందరిముందూ ఐదు గుంజీలు తీస్తే సరిపోతుందని ఆదేశించారు. దీంతో అందరిముందూ నిందితుడు ఐదు గుంజీలు తీశాడు. తర్వాత వెళ్లిపోయాడు.

San Francisco: మనుషుల్ని చంపేందుకు రోబోలు.. అమెరికా పోలీసుల ప్రతిపాదన

దీంతో ఈ వివాదం అక్కడితో సద్దుమణిగింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిందితుడు గుంజీలు తీస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ విషయంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అత్యాచార నిందితుడికి ఐదు గుంజీలు మాత్రమే శిక్ష విధించడంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పెద్దల తీర్పు అనాగరికతకు చిహ్నంగా ఉందని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. గ్రామ పెద్దలను కూడా అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు.