San Francisco: మనుషుల్ని చంపేందుకు రోబోలు.. అమెరికా పోలీసుల ప్రతిపాదన

ఇకపై రోబోలు మనుషుల్ని చంపబోతున్నాయి. ఔను! మనుషుల్ని చంపగలిగే రోబోల్ని అమెరికా పోలీసులు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులకు ప్రతిపాదనలు కూడా పంపారు.

San Francisco: మనుషుల్ని చంపేందుకు రోబోలు.. అమెరికా పోలీసుల ప్రతిపాదన

San Francisco: అమెరికాలాంటి దేశాల్లో పోలీసు విభాగంలో కొన్ని చోట్ల రోబోలు కూడా పని చేస్తున్నాయి. ఎక్కువగా తనిఖీలు, బాంబుల గుర్తింపు వంటి సేవల్లో రోబోలు పనిచేస్తున్నాయి. అయితే, ఇకపై రోబోల్ని మనుషుల్ని చంపేందుకు కూడా వాడాలి అనుకుంటున్నారు అక్కడి పోలీసులు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర.. మనీష్ సిసోడియా ఆరోపణ

శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన పోలీసులు దీని కోసం కసరత్తు చేస్తున్నారు. తీవ్రమైన నేరాలు, దాడులు వంటి సందర్భాల్లో అవసరమైతే నేరస్థులను చంపేందుకు ఈ రోబోలు ఉపయోగపడతాయని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు.. దీనిపై ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు కూడా పంపారు. ఇప్పటికే ఈ తరహా రోబోలు 17 వరకు ఉండగా, వాటిలో 12 పని చేయడం లేదు. మిగతా రోబోల్ని ఎలా వాడాలి అని ఆలోచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ రోబోలను వినియోగించాలి అనుకుంటున్నారు. క్రిమినల్స్‌ను చంపగలిగే రోబోల్ని సిద్ధం చేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో, మరో అవకాశం లేని చోట ఈ రోబోలను వినియోగిస్తారు. సాధారణ ప్రజలు, అధికారుల ప్రాణాలకు ఎవరివల్లనైనా హాని కలుగుతుంది అని భావించినప్పుడు ఈ రోబోలు నేరస్థులను చంపేస్తాయి.

అయితే, ఇవి స్వతంత్రంగా కాకుండా అధికారుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాయి. ఇందుకు అనుగుణంగా రోబోల్ని ఆయుధాలు ప్రయోగించగలిగేలా మారుస్తారు. ఈ ప్రతిపాదనకు ఉన్నతాధికారులు ఆమోదం తెలపాల్సి ఉంది.