Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర.. మనీష్ సిసోడియా ఆరోపణ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఈ అంశంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర.. మనీష్ సిసోడియా ఆరోపణ

Arvind Kejriwal ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికలతోపాటు, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ ఈ హత్య కుట్రకు తెరతీసిందన్నారు.

Kim’s Daughter: కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల పరిచయం చేసిన కూతురి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా?

ట్విట్టర్ వేదికగా గురువారం రాత్రి మనీష్ సిసోడియా ఈ ఆరోపణలు చేశారు. అలాగే బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ.. తన గూండాలను కేజ్రీవాల్‌పై దాడికి ఉసిగొల్పాడని కూడా మనీష్ ఆరోపించారు. అయితే, బీజేపీ చేస్తున్న చర్యలకు ఆప్ భయపడదని మనీష్ అభిప్రాయపడ్డారు. బీజేపీ గూండా రాజకీయాలకు ప్రజలే సమాధానం చెబుతారని ఆయన అన్నారు. మనీష్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ఈ అంశంపై వెంటనే స్పందించి, విచారణ జరపాల్సిందిగా ఆయన పోలీసుల్ని ఆదేశించారు. మనీష్ ఈ ఆరోపణలు చేసేందుకు ఒక కారణం ఉంది. గురువారం ఉదయం బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ కేజ్రీవాల్ భధ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టిక్కెట్లు అమ్ముకున్నారనే అభియోగాల నేపథ్యంలో కేజ్రీవాల్ భద్రత గురించి ప్రస్తావించారు. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ-ఆప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక్కడ 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీ పారిశుధ్యం విషయంలో చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు.