Indian Woman Anju love story : పాకిస్థానీతో అంజూ వివాహం…ఆమె తండ్రి ఏం చెప్పారంటే…

పాక్ వెళ్లిన భారతీయ మహిళ అంజూ ప్రేమ కథ మలుపులు తిరుగుతోంది. భర్త, పిల్లలను వదిలి పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సుకు వెళ్లి అక్కడి తన ఫేస్‌బుక్ స్నేహితుడిని వివాహం చేసుకున్న అంజూ బాగోతంపై ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు....

Indian Woman Anju love story : పాకిస్థానీతో అంజూ వివాహం…ఆమె తండ్రి ఏం చెప్పారంటే…

Indian Woman Anju love story

Indian Woman Anju love story : పాక్ వెళ్లిన భారతీయ మహిళ అంజూ ప్రేమ కథ మలుపులు తిరుగుతోంది. భర్త, పిల్లలను వదిలి పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సుకు వెళ్లి అక్కడి తన ఫేస్‌బుక్ స్నేహితుడిని వివాహం చేసుకున్న అంజూ బాగోతంపై ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. (Married Her Pakistani Friend) అంజూ తమ కుటుంబానికి ఇక లేదని, ఆమె చనిపోయినట్లేనని ఆమె తండ్రి థామస్ చెప్పారు. (Father Of Indian Woman) ఇద్దరు పిల్లల భవిష్యత్తును అంజూ నాశనం చేసిందని, ఇలా చేయాలంటే ముందుగా భర్తకు విడాకులు ఇచ్చి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు.

Mosque Blast : పాక్ మసీదులో పేలుడు, పోలీసు అధికారి మృతి, పలువురికి గాయాలు

భర్త భవిష్యత్తును కూడా నాశనం చేసిందని, అంజూ పిల్లలను ఎవరు చూసుకుంటారని ఆయన ప్రశ్నించారు. అంజూను తిరిగి స్వదేశానికి తీసుకురావాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారా అని అడిగిన ప్రశ్నకు, థామస్ అలాంటిదేమీ చేయనని చెప్పారు. అంజు తనతో మాట్లాడటం లేదని, ఆమె తల్లితో మాత్రమే మాట్లాడిందని చెప్పారు. తన కూతురు అంజూ చనిపోవాలని ప్రార్థిస్తున్నానని తండ్రి థామస్ చెప్పారు. ‘‘ఆమెకు పాస్‌పోర్టు ఎలా వచ్చిందో, వీసా ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు’’ అని ఆయన పేర్కొన్నారు.

Plane Crashes : గ్రీస్ కార్చిచ్చు ఆర్పటానికి వచ్చిన విమానం కూలి ఇద్దరు పైలెట్ల మృతి

తన పిల్లల్లో ఎలాంటి నేర ప్రవృత్తి లేదని, ఈ విషయంలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన చెప్పారు. అంజూ ఇస్లాం మతంలోకి మారి ఫాతిమా అని పేరు పెట్టుకొని, పాకిస్థానీ ప్రేమికుడు నస్రుల్లాను వివాహం చేసుకుందని వెల్లడైంది. (Indian Woman Anju love story) 34 ఏళ్ల భారతీయ మహిళ అంజూ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అప్పర్ దిర్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల పాకిస్థాన్ స్నేహితుడు నస్రుల్లాతో వివాహం అనంతరం ఆయన ఇంట్లో ఉంటోంది.