Tamilnadu : భర్తకు షాక్…పెళ్లైన నెలకే ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న ఇల్లాలు

సమాజంలో  కట్టుబాట్లు సాంప్రదాయాలు దాదాపు కనుమరుగై పోతున్నాయి. పెళ్లైన నెల రోజులకే  భార్య భర్తకు షాకిచ్చింది. తాళి కట్టిన భర్తను వదిలి ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న ఘటన తమిళనాడులో

Tamilnadu : భర్తకు షాక్…పెళ్లైన నెలకే ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న ఇల్లాలు

Married Woman Eloped With Boy Friend

Updated On : March 18, 2022 / 10:48 AM IST

Tamilnadu : సమాజంలో  కట్టుబాట్లు సాంప్రదాయాలు దాదాపు కనుమరుగై పోతున్నాయి. పెళ్లైన నెల రోజులకే  భార్య భర్తకు షాకిచ్చింది. తాళి కట్టిన భర్తను వదిలి ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

తిరువణ్ణామలై జిల్లా వేంగికాల్ గ్రామానికి చెందిన యువతికి  అదే గ్రామానికి చెందిన బంధువుల యువకుడితో పెద్దల   సమక్షంలో నెల క్రిందట  వివాహం జరిగింది.   వివాహం అయినప్పటి  నుంచి ఆమె భర్తతో ముభావంగా  ఉండసాగింది.

అయితే మార్చి 15  మంగళవారం నాడు ఉన్నట్టుండి ఆమె ఇంట్లో నుంచి మాయమయ్యింది. ఎక్కడకు వెళ్లిందో  అర్ధం కాని కుటుంబ సభ్యులు, ఆమె తల్లి తండ్రులు అంతా గాలించారు. అయినా ఆమె ఆచూకి లభించలేదు. ఇదిలా ఉండగా ఇంట్లోనుంచి వెళ్లి పోయిన యువతి తన ప్రియుడ్ని వివాహం చేసుకుని వెళ్లిపోయినట్లుగా తెలుసుకుని అంతా అవాక్కయ్యారు.

Also Read : Social Media : న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలని వేధింపులు-అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న అనంతరం ఆ కొత్త దంపతులు ఇద్దరూ తమకు రక్షణ కల్పించాలని  కోరుతూ తిరువణ్ణామలై  తాలూకా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ విషయాన్ని  కోర్టులో తేల్చుకోమని సలహా ఇచ్చి పంపించి  వేశారు.