Social Media : న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలని వేధింపులు-అరెస్ట్ చేసిన పోలీసులు
సోషల్ మీడియాలో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలని వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Social Media Nude Video Call
Social Media : సోషల్ మీడియాలో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలని వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం భూపాల్‌పల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన దానం సాయి కృష్ణ ఇటీవల బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు హాజరయ్యాడు.
అక్కడ తనకు మరదలి వరసయ్యే మహిళను చూసాడు. దీంతో అతడికి ఆమెపై కోరిక పెరిగింది. బాధితురాలు స్నానం చేస్తుండగా ఆమెకు తెలియకుండా రహస్యంగా సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ వీడియోలు, ఫొటోలను బాధితురాలి వాట్సాప్‌కు పంపించాడు.
Also Read : Air Gun Firing Case : ఎయిర్ గన్ పేలి బాలిక మృతి కేసు-నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
తనతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలని లేకపోతే ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరించసాగాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సాయికృష్ణను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్, సిమ్ కార్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు.