Air Gun Firing Case : ఎయిర్ గన్ పేలి బాలిక మృతి కేసు-నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

కోతులొస్తున్నాయని, వాటిని బెదిరించటానికి ఎయిర్ గన్ కొన్నారు. కానీ, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టలేదు. కొంగలను కొట్టేందుకు వాడారు.. కానీ దాన్ని అన్‌లోడ్ చేయలేదు.

Air Gun Firing Case : ఎయిర్ గన్ పేలి బాలిక మృతి కేసు-నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Air Gun Firing Case

Air Gun Firing Case :  కోతులొస్తున్నాయని, వాటిని బెదిరించటానికి ఎయిర్ గన్ కొన్నారు. కానీ, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టలేదు. కొంగలను కొట్టేందుకు వాడారు.. కానీ దాన్ని అన్‌లోడ్ చేయలేదు. సెల్ఫీ మోజులో ఫొటోలు దిగినా.. మైనర్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఓ పసిప్రాణం పోయింది. సంగారెడ్డి జిల్లా వావిలాలలో జరిగిన ఎయిర్‌గన్‌ కేసును పోలీసులు ఛేదించారు.

ఎయిర్‌గన్‌ ప్రమాదంలో మరణించిన నాలుగేళ్ల చిన్నారిది మర్డర్‌గా నిర్ధారించారు పోలీసులు. కానీ, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా వావిలాలలో బుధవారం ఎయిర్ గన్‌ పేలిన ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేసి వివరాలు సేకరించారు. ఫామ్‌హౌస్‌ ఓనర్ ప్రసాద్‌తో పాటు గన్‌ ఆపరేట్‌ చేసిన 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు.

ఫామ్‌హౌస్‌ ఓనర్ ప్రసాద్‌ ఆన్‌లైన్‌లో ఎనిమిది నెలల క్రితం ఎయిర్‌ గన్‌ కొన్నాడు. గన్‌కు సంబంధించిన బుల్లెట్‌ను అబిడ్స్‌లో కొనుగోలు చేశాడు. నిరుపయోగంగా ఉన్న ఆ గన్‌ను ఓనర్ ప్రసాద్ నిర్లక్ష్యంగా వాచ్‌మెన్‌ రూమ్‌లో పడేశాడు. అయితే ఊరు నుంచి వచ్చిన బంధువుల అబ్బాయి కంట పడింది ఆ గన్‌. ఆ 17ఏళ్ల యువకుడు గన్‌తో సరదాగా సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ఒక్కసారిగా ట్రిగ్గర్‌ ప్రెస్ చేయడంతో ఎదురుగా ఉన్న నాలుగేళ్ల చిన్నారి శాన్వి కుడి కనతలోకి దూసుకెళ్లింది బుల్లెట్. వెంటనే ఆసుపత్రికి తరలించినా… చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.
Also Read : Chappal Holi : హోలీ రోజు అక్కడ చెప్పులతో కొట్టు కుంటారు
గాయాలైన చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అయితే చికిత్స పొందుతూ 16న చిన్నారి మరణించింది. ఎయిర్ గన్‌ను సెక్యూరిటీ లేకుండా అక్కడ పెట్టిన ఫామ్‌ హౌజ్ ఓనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌ గన్‌ను అతను ఆన్‌లైన్‌లో కొన్నాడని, బుల్లెట్లను ఆబిడ్స్‌లో కొనుగోలు చేసాడు. ఎయిర్ గన్‌లను టార్గెట్ ప్రాక్టీస్ కోసం మాత్రమే ఉపయోగించాలని, ఇతర అవసరాల కోసం ఎవరైనా ఉపయోగిస్తే వాటిని పోలీసులకు హాండోవర్ చేయాలంటున్నారు పోలీసులు.