Maharashtra: విద్యార్థి చేయి విరిగేలా కొట్టిన టీచర్.. పోలీస్ కేసు నమోదు

తోటి విద్యార్థితో గొడవ పడుతున్న ఒక విద్యార్థిని టీచర్ కర్రతో కొట్టాడు. తీవ్రంగా కొట్టడంతో విద్యార్థి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి మోచేయి విరిగింది. దీంతో బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Maharashtra: విద్యార్థి చేయి విరిగేలా కొట్టిన టీచర్.. పోలీస్ కేసు నమోదు

Maharashtra: పదో తరగతి చదువుతున్న విద్యార్థిపై టీచర్ కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటనలో విద్యార్థి మోచేయి విరిగింది. మహారాష్ట్రలోని థానె జిల్లాలో, గత గురువారం ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

PM Modi: పోషకాహార లోపంపై పోరాడాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు

వారు తెలిపిన వివరాల ప్రకారం.. తిత్వాలాలోని ఒక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థికి, మరో విద్యార్థితో గొడవ జరిగింది. దీంతో ఈ విషయంపై ఒక విద్యార్థి టీచర్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే కోపం తెచ్చుకున్న టీచర్.. మరో విద్యార్థిని కర్రతో కొట్టాడు. ఈ ఘటనలో విద్యార్థికి గాయాలయ్యాయి. ముఖ్యంగా బాధిత విద్యార్థికి మోచేయి విరిగింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించారు. ఎక్స్‌రే తీసిన వైద్యులు.. విద్యార్థి మోచేయి విరిగినట్లు చెప్పారు.

Alan Walker ‘వరల్డ్ ఫేమస్ డీజే’ ఇన్ సిటీ.. హైదరాబాద్ రానున్న అలాన్ వాకర్

తమ కొడుకు చేయి విరగడంతో, బాధిత విద్యార్థి తల్లిదండ్రులు.. ఘటనకు కారణమైన టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.