PM Modi: పోషకాహార లోపంపై పోరాడాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు

వచ్చె సెప్టెంబర్ నెలను ‘పోషకాహార మాసం’గా జరుపుకోవాలని సూచించారు ప్రధాని మోదీ. దేశంలో పోషకాహార లోపాన్ని పారద్రోలేందుకు ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘మన కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మోదీ మాట్లాడారు.

PM Modi: పోషకాహార లోపంపై పోరాడాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు

PM Modi: ప్రజలంతా దేశంలో పోషకాహార లోపాన్ని పారద్రోలేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నెల ‘మన కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం.. దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. పోషాకాహార లోపంపై పోరాడాలని సూచించారు.

West Bengal: కలుషిత నీరు తాగి బాలుడు మృతి.. మరో 50 మందికి అస్వస్థత

‘‘సెప్టెంబర్ అనేక పండుగలకు నెలవు. ఈ నెలను పోషకాహార మాసంగా జరుపుకోవాలి. ప్రతి ఏడాది సెప్టెంబర్ 1-30 వరకు పోషకాహార మాసంగా జరుపుకొంటాం. దేశంలో పోషకాహార లోపాన్ని పారద్రోలేందుకు అందరూ కృషి చేయాలి. ‘పోషణ్ అభియాన్’లో సాంకేతిక, ప్రజా భాగస్వామ్యాన్ని మరింత మెరుగైన పద్ధతుల్లో వాడటం చాలా ముఖ్యం. దేశంలో పోషకాహార లోపాన్ని రూపుమాపేందుకు ‘జల్ జీవన్ మిషన్’ ఎంతగానో ఉపయోగపడుతుంది. దరదర్శర్ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ‘స్వరాజ్’ సీరియల్ చూడండి. స్వాతంత్ర్య సమరయోధుల జీవిత విశేషాలు, వాళ్లు చేసిన త్యాగాలను ఈ సీరియల్‌లో అద్భుతంగా చూపిస్తున్నారు.

Anasuya – Sraddhadas : ఆంటీ అటాక్.. అనసూయ మీద నుంచి శ్రద్ధాదాస్‌కు.. వదలంటున్న నెటిజన్లు.. తగ్గేదేలే అంటున్న అనసూయ..

అమృత మహోత్సవాల అమృతధార.. దేశం నలుమూలలా ప్రవహిస్తోంది. అమృత స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా దేశ సమష్టి బలాన్ని మనం చూడగలిగాం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. 2014 అక్టోబర్ 3న ప్రారంభమైన ‘మన్ కీ బాత్’ అనే రేడియా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమవుతుంది. ఇందులో ప్రధాని మోదీ.. ప్రతి నెలా కొన్ని కీలక అంశాల గురించి ప్రస్తావిస్తారు. దేశ ప్రజలకు పలు సూచనలు చేస్తారు.