West Bengal: కలుషిత నీరు తాగి బాలుడు మృతి.. మరో 50 మందికి అస్వస్థత

ఒక ఊరిలో కలుషిత నీళ్లు తాగిన పన్నెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అదే గ్రామానికి చెందిన మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ప్రస్తుతం అధికారులు చికిత్స అందిస్తున్నారు.

West Bengal: కలుషిత నీరు తాగి బాలుడు మృతి.. మరో 50 మందికి అస్వస్థత

West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో కలుషిత నీళ్లు తాగి పన్నెండేళ్ల బాలుడు మరణించాడు. మరో 50 మందికిపైగా అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటన మథువాపూర్ గ్రామంలో శనివారం జరిగింది. బాలుడి మరణంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Anasuya – Sraddhadas : ఆంటీ అటాక్.. అనసూయ మీద నుంచి శ్రద్ధాదాస్‌కు.. వదలంటున్న నెటిజన్లు.. తగ్గేదేలే అంటున్న అనసూయ..

బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. బాలుడితోపాటు అనేక మంది గ్రామస్తులు కలుషిత నీళ్లు తాగడం వల్ల డయేరియా వంటి లక్షణాలకు గురయ్యారు. దీంతో బాలుడిని, మరి కొందరిని ఆస్రత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామంలో పరిస్థితి గురించి తెలుసుకున్న అధికారులు ప్రత్యేక వైద్య బృందాన్ని గ్రామానికి పంపించారు. గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.

#TwinTowers: నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతలో 10 కీలక అంశాలు

అస్వస్థతకు గురైన 50 మందిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వీరిని మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పంపారు.