Anasuya – Sraddhadas : ఆంటీ అటాక్.. అనసూయ మీద నుంచి శ్రద్ధాదాస్‌కు.. వదలంటున్న నెటిజన్లు.. తగ్గేదేలే అంటున్న అనసూయ..

ఈ వివాదంలో అనసూయకి కొంతమంది సపోర్ట్ గా కామెంట్స్ చేశారు. ఇందులో హీరోయిన్ శ్రద్ధాదాస్ అనసూయకి సపోర్ట్ ఇస్తూ .. ''నీకంటే సగం వయసున్న అమ్మాయిల కంటే కూడా నువ్వే చాలా అందంగా కనిపిస్తావు. నీకంటే ఎక్కువ వయసున్న...............

Anasuya – Sraddhadas : ఆంటీ అటాక్.. అనసూయ మీద నుంచి శ్రద్ధాదాస్‌కు.. వదలంటున్న నెటిజన్లు.. తగ్గేదేలే అంటున్న అనసూయ..

Anasuya – Sraddhadas :  గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆంటీ అనే పదమే వినిపిస్తుంది. ఇందుకు కారణం అనసూయ. ఎప్పుడో గతంలో జరిగిన ఓ సంఘటనని గుర్తు చేస్తూ విజయ్ లైగర్ సినిమా పోయిందంటూ ఇండైరెక్ట్ గా ట్వీట్స్ చేసింది. దీనికి విజయ్ ఫ్యాన్స్ కొంతమంది కౌంటర్లిస్తూ ట్వీట్స్ చేశారు. ఇందులో కొంతమంది ఆంటీ అని ట్వీట్ చేయడంతో ఆంటీ అంటే పోలీస్ కేసు పెట్టి జైలులో వేయిస్తా అని ట్వీట్ చేసింది. అంతే ఆంటీ అంటే జైలులో వేయిస్తావా అంటూ నెటిజన్లు రెచ్చిపోయి మరీ ట్వీట్స్ చేశారు. ఏకంగా ఇండియా వైడ్ ఆంటీ అనే పదాన్ని ట్రెండింగ్ చేశారు.

అయితే ఈ వివాదంలో అనసూయకి కొంతమంది సపోర్ట్ గా కామెంట్స్ చేశారు. ఇందులో హీరోయిన్ శ్రద్ధాదాస్ అనసూయకి సపోర్ట్ ఇస్తూ .. ”నీకంటే సగం వయసున్న అమ్మాయిల కంటే కూడా నువ్వే చాలా అందంగా కనిపిస్తావు. నీకంటే ఎక్కువ వయసున్న అంకుల్స్‌ కంటే కూడా నువ్వే హాట్‌గా కనిపిస్తావు. నేను నీకు ఎప్పుడూ అభిమానినే” అని ట్వీట్ చేసింది. ఇంకేముంది అనసూయకి సపోర్ట్ చేస్తావా అంటూ శ్రద్ధాదాస్ మీద పడ్డారు నెటిజన్లు.

Anchor Anasuya : ట్రెండింగ్‌లో ‘ఆంటీ’.. పాపం అనసూయ.. దారుణంగా ఆడేసుకుంటున్న నెటిజన్లు..

ఈ ట్రోలింగ్ ని ఊహించని శ్రద్ధాదాస్.. ”నన్ను తిట్టుకుంటూ మీ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. మీరు నన్ను తిడుతూ పోస్ట్ చేసే ట్వీట్స్ అన్ని డిలీట్ చేస్తా, మీ అకౌంట్స్ ని బ్లాక్ చేస్తా, అనసూయని పొగిడినందుకు నన్ను ట్రోల్ చేయడమేంటో నాకు అర్ధం కావడం లేదు” అంటూ ఓ ట్వీట్ వేసి సైలెంట్ గా సైడ్ అయిపోయింది.

దీంతో నెటిజన్లు.. అనసూయ గురించి నీకు తెలీదు, చాలా మంది హీరోయిన్స్, యాంకర్స్, ఆర్టిస్టులు ఉన్నా ఎవర్ని ట్రోల్ చేయని వాళ్ళు అనసూయని ట్రోల్ చేస్తున్నారంటే తప్పు ఎవరిదో తెలుసుకొని మాట్లాడండి. అనసూయనే ఇది మొదలుపెట్టింది. అనవసరమైన ట్వీట్స్ చేసేది అనసూయనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక అనసూయ మాత్రం తన తప్పు ఉన్నా, గతంలో తాను ఆంటీ అని పిలిచిన వీడియోల్ని షేర్ చేస్తూ ప్రశ్నించినా, వేరే స్టార్స్ ఆంటీ అని పిలిస్తే ఎలా రియాక్ట్ అయ్యారో వీడియోలు అనసూయకి షేర్ చేసినా తాను మాత్రం తగ్గేదేలే అంటుంది. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.