Girl Raped : తుపాకీతో బెదిరించి బాలికపై గ్యాంగ్ రేప్
బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులను ఇప్పటివరకూ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. మే 13 రాత్రి తమ కుమార్తెను ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
gang-raped a girl : దేశంలో నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా చిన్నారులు, బాలికలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనేవున్నాయి. కామాంధులు మృగాళ్లుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా రాజస్ధాన్లో దారుణం జరిగింది. తుపాకీతో బెదరించి ఇద్దరు వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. భరత్పూర్లో మే 13న ఇద్దరు వ్యక్తులు 12 ఏండ్ల బాలికను తుపాకీతో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.
బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులను ఇప్పటివరకూ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. మే 13 రాత్రి తమ కుమార్తెను ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Minors Gang Rape Girl : దారుణం.. 11ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్
మరుసటి రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో బాలికను కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు ఇప్పటివరకూ నిందితులను అరెస్ట్ చేయలేదని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.