Minors Gang Rape Girl : దారుణం.. 11ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్

జార్ఖండ్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఆరుగురు మైనర్లు 11ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేశారు.(Minors Gang Rape Girl)

Minors Gang Rape Girl : దారుణం.. 11ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్

Minors Gang Rape Girl

Updated On : April 24, 2022 / 5:44 PM IST

Minors Gang Rape Girl : బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో పిల్లలు దారి తప్పుతున్నారు. పెడదోవ పడుతున్నారు. చూడకూడనివి చూస్తున్నారు. చేయకూడని పనులు చేస్తున్నారు. నేరాలకు, ఘోరాలకు, దారుణాలకు ఒడిగడుతున్నారు. సభ్య సమాజం ఉలిక్కిపడేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా జార్ఖండ్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఆరుగురు మైనర్లు 11ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేశారు.

జార్ఖండ్‌లోని కుంతి జిల్లా తప్కారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19న ఈ ఘోరం జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా(ఏప్రిల్ 23) వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది.(Minors Gang Rape Girl)

Matrimony Site Cheat : మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైంది, పెళ్లి చేసుకుంటానంది.. కట్ చేస్తే రూ.46 లక్షలు కాజేసింది

తప్కారా పోలీసు స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 11ఏళ్ల బాలిక తన ఫ్రెండ్స్ తో కలిసి పక్క గ్రామంలో పెళ్లికి వెళ్లింది. అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తుంటే కొందరు అబ్బాయిలతో గొడవ జరిగింది. పెళ్లి కార్యక్రమం తర్వాత బాలిక తన ఫ్రెండ్స్ తో కలిసి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. అప్పటికే కోపంతో ఉన్న మైనర్ల గ్యాంగ్.. బాలికను అడ్డుకుంది. బాలికను పక్కకు లాక్కెళ్లిన ఆ ఆరుగురు.. అత్యాచారం చేశారు. నిందితుల వయసు 10 నుంచి 16ఏళ్ల లోపేనని పోలీసులు తెలిపారు. నిందితులు అందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు జువనైల్ హోమ్ కు తరలించారు. కాగా, నిందితులంతా బాలికకు తెలిసిన వారే.

దీనిపై కుంతి ఎస్పీ అమన్ కుమార్ స్పందించారు. తమకు ఫిర్యాదు అందిన వెంటనే యాక్షన్ తీసుకున్నామని చెప్పారు. కంప్లైంట్ రాగానే దర్యాప్తు మొదలు పెట్టామని వివరించారు. నిందితులంతా పది నుంచి 16 ఏళ్ల వయసులోని బాలురే అని చెప్పారు. వారందరినీ అరెస్టు చేశామని తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరిచామని, వారిని జువనైల్ జైలుకు పంపించాల్సిందిగా కోర్టు ఆదేశించిందని వెల్లడించారు. ఈ కేసులో బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులు, బాలిక ఇద్దరు స్నేహితులు తమకు స్టేట్‌మెంట్ ఇచ్చారని చెప్పారు.(Minors Gang Rape Girl)

Malkajgiri : నగల కోసం ఏకంగా భక్తురాలినే హత్య చేసిన పూజారి

తొలుత ఈ ఘటనపై కేసు పెట్టాల్సిన అవసరం లేదని స్థానికులు కొందరు బాలిక తల్లిదండ్రులను వారించినట్టు తెలిసింది. గ్రామస్థాయిలోనే పంచాయతీ పెట్టి నిందితులకు బుద్ధి చెబుదామని, బాలికకు తగిన న్యాయం అందిస్తామని సర్ది చెప్పే ప్రయత్నాలు జరిగినట్టు సమాచారం. అంతేకాదు.. పోలీసు కేసు పెడితే కుటుంబం పరువు పోతుందని బాలిక తల్లిదండ్రులు తొలుత సంశయించారు. దీంతో ఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఫిర్యాదు చేయడంలో ఆలస్యమైంది. చివరకు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Minor Girls Gang Raped : పోర్న్ వీడియోలు చూసి ఘోరం.. ఇద్దరు చిన్నారులపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్

ఆరుగురు మైనర్లు బాలికను గ్యాంగ్ రేప్ చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. స్థానికులకు షాక్ కి గురి చేసింది. మైనర్ల విపరీత ప్రవర్తన ఆందోళనకు గురి చేసింది. పిల్లలు పెడదోవ పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని పోలీసులు చెబుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? ఇలాంటి అంశాలపై నిత్యం నిఘా ఉంచాలన్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే వారిని సరిదిద్దాలన్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.