Minor Girls Gang Raped : పోర్న్ వీడియోలు చూసి ఘోరం.. ఇద్దరు చిన్నారులపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్

మొబైల్ లో పోర్న్ వీడియోలు చూడటానికి అలవాటు పడిన ఐదుగురు మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. కామంతో కళ్లుమూసుకుపోయి ఇద్దరు బాలికలపై..

Minor Girls Gang Raped : పోర్న్ వీడియోలు చూసి ఘోరం.. ఇద్దరు చిన్నారులపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్

Minor Girls Gang Raped

Minor Girls Gang Raped : స్మార్ట్ ఫోన్లు వచ్చాక జీవితమే మారిపోయింది. అవి.. అందరి జీవితంలో భాగమైపోయాయి. చిన్న, పెద్ద.. ధనిక, పేద.. అనే తేడా లేదు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. వీటి కారణంగా చాలా వరకు పనులు సులభం అయిపోయాయి. చిటికెలో పనులన్నీ అయిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంతా సంతోషిస్తున్నారు.

అదే సమయంలో నాణెనికి మరోవైపు ఉన్నట్లే స్మార్ట్ ఫోన్ల వల్ల ప్రయోజనాలే కాదు నేరాలు, ఘోరాలూ జరిగిపోతున్నాయి. ఫోన్ లో చూడకూడనివి చూసేస్తున్నారు. ఆ తర్వాత నేరాలకు, ఘోరాలకు తెగబడుతున్నారు. బీహార్ లో అలాంటి దారుణం ఒకటి జరిగింది. మొబైల్ లో పోర్న్ వీడియోలు చూడటానికి అలవాటు పడిన ఐదుగురు మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. కామంతో కళ్లుమూసుకుపోయి ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్ కి(Minor Girls Gang Raped) పాల్పడ్డారు.

Rape Attempted : విదేశీ మహిళపై అత్యాచారయత్నం

బీహార్ బార్బిఘా ప్రాంతంలో దారుణం జరిగింది. మొబైల్ లో పోర్న్ వీడియోలు చూసిన ఐదుగురు మైనర్లు ఇద్దరు చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ వారికి రూ.5 ఇచ్చారు. బాలికలు పొలం పనికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కాగా, ఆ ఇద్దరిలో ఒకరి ఆరోగ్యం క్షీణించింది. దీంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకుని విచారించగా.. వారి చెప్పిన సమాధానం విని వారికి మైండ్ బ్లాంక్ అయ్యింది. పోర్న్ వీడియోలు చూసి ఇలా చేశామని వారు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు.

Father Rapes Daughter : కూతురిపై తండ్రి అత్యాచారం.. 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

ఇద్దరు మైనర్ బాలికల్లో ఒకరు ప్రభుత్వ స్కూల్ లో 6వ తరగతి, మరొకరు 7వ తరగతి చదువుతున్నారు. నిందితుల్లో ముగ్గురు 6వ తరగతి, ఒకరు 7వ తరగతి, మరొకరు 8 తరగతి చదువుతున్నారు. పొలంలో కూరగాయలు కోసేందుకు బాలికలు వచ్చారని, అదే సమయంలో మైనర్ బాలురు దారుణానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. దీని గురించి ఎవరికీ చెప్పొద్దని నిందితులు ఓ బాలికకు 3 రూపాయలు, మరో బాలికకు 5 రూపాయలు ఇచ్చారని పోలీసులు వెల్లడించారు. నిందితులు ప్రస్తుతం జువైనల్ జస్టిస్ బోర్డు కస్టడీలో ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికలను ఆసుపత్రికి తీసుకెళ్లారు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద జుడిషియల్ మేజిస్ట్రేట్ సమక్షంలో బాలికల స్టేట్ మెంట్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Love Story Tragedy : ఎనిమిదేళ్ల ప్రేమ, సహజీవనం-విషాదాంతం

ఫోన్ లో పోర్న్ వీడియోలు చూసి మైనర్ బాలురు బాలికలపై గ్యాంగ్ రేప్ కి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ విషయం తెలిసి అంతా నిర్ఘాంతపోతున్నారు. బుద్ధిగా స్కూల్ కి వెళ్తూ చక్కగా చదువుకుంటూ తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో పిల్లల్లో ఈ విపరీత పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పిల్లలు అడిగిన వెంటనే తల్లిదండ్రులు వారికి స్మార్ట్ ఫోన్లు కొనిచ్చి మురిసిపోవడం కాదని, ఫోన్ లో పిల్లలు ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనేది నిత్యం గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. పరిస్థితులు చేయి దాటాక ఎంత చింతించినా ప్రయోజనం ఉండదంటున్నారు.