Malkajgiri : నగల కోసం ఏకంగా భక్తురాలినే హత్య చేసిన పూజారి

గ్రేటర్ హైదరాబాద్‌...మల్కాజ్‌గిరిలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ ....విగతజీవిగా కనిపించింది. ఈ నెల 18న వినాయక ఆలయానికి వెళ్లిన ఉమాదేవి ...శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు రోధిస్తున్నారు.

Malkajgiri : నగల కోసం ఏకంగా భక్తురాలినే హత్య చేసిన పూజారి

Malkajgiri

priest killed devotee : హైదరాబాద్‌ మల్కాజిగిరిలో హత్యకు గురైన ఉమాదేవి కేసును పోలీసులు ఛేదించారు. సిద్ధి వినాయక గుడికి వెళ్లిన ఉమాదేవిని పూజారి మురళీ కృష్ణ హత్య చేశాడని దర్యాప్తులో తేలింది. ఉమాదేవి ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాల కోసం హత్య చేసినట్టు నిర్ధారణ అయింది. ఈనెల 18న సిద్ధి వినాయక గుడికి వెళ్లిన ఉమాదేవి ఆతర్వాత నుంచి కనించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. గుడికి వెళ్లిన ఉమాదేవి నగలపై కన్నేసిన పూజారి మురళి ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.

గ్రేటర్ హైదరాబాద్‌…మల్కాజ్‌గిరిలో నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన మహిళ ….విగతజీవిగా కనిపించింది. ఈ నెల 18న వినాయక ఆలయానికి వెళ్లిన ఉమాదేవి …శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు రోధిస్తున్నారు. ఆలయం వెనుక భాగంలో నాలాలు, తుప్పలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఉమాదేవి మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. బంగారు గాజాలు, మంగళసూత్రాలు మాయమవడంతో.. ఉమాదేవిని దొంగలు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.

Hyderabad : మల్కాజ్‌గిరి మహిళ హత్య కేసులో నిందితులు ఎవరు ?

మల్కాజ్‌గిరి ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు లేవు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం గుడికి వెళ్లి తిరిగి ఇంటికి చేరకపోయేసరికి ఉమాదేవి అదృశ్యయ్యారంటూ స్థానికంగా పోస్టర్లు కూడా అతికించారు కుటుంబసభ్యులు. ఉమాదేవి మిస్సింగ్ అయ్యాక ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు…ఇవాళ ఆలయం పరిసరాల్లో విస్తృతంగా వెతికారు.

నాలాలు, తుప్పలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో మహిళ మృతదేహం కనిపించంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం కనిపించిన ప్రదేశంలో పోలీసులు క్లూస్ సేకరిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాక …ఉమాదేవి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తామని పోలీసులు తెలిపారు.