Hyderabad : మల్కాజ్‌గిరి మహిళ హత్య కేసులో నిందితులు ఎవరు ?

హైదరాబాద్ మల్కాజ్ గిరిలో మూడు రోజుల క్రితం ఆదృశ్యమైన మహిళ హత్య చేయబడిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది.

Hyderabad : మల్కాజ్‌గిరి మహిళ హత్య కేసులో నిందితులు ఎవరు ?

Malkajgiri Woman Death

Hyderabad : హైదరాబాద్ మల్కాజ్ గిరిలో మూడు రోజుల క్రితం ఆదృశ్యమైన మహిళ హత్య చేయబడిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఆలయ పూజారి మురళే మహిళ ఒంటిపై ఉన్న బంగారు నగల కోసం హత్య చేసినట్లు పోలీసులు అనుమానించి ఈరోజు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మూడు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిన్న గుడి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద కుళ్లిపోయిన స్ధితిలో ఉన్న మహిళ మృతదేహం లభ్యం అయ్యింది. వారి కుటుంబ సభ్యులకు చూపించగా తప్పిపోయిన మహిళ మృతదేహంగా వారు గుర్తించారు.

కేసు వివరాల్లోకి వెళితే మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విమలాదేవినగర్‌కు చెందిన జీవీఎన్‌ మూర్తి భార్య ఉమాదేవి(56) రోజూ శివపురి కాలనీలో ఉండే స్వయంభూ వినాయక దేవాలయానికి వెళుతూ ఉండేవారు. ఈ నెల 18న గుడికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు.

దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం ఎన్ని చోట్ల గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం ఉదయం గుడికి సమీపంలోని రైల్వే ట్రాక్ పరిసరాలలో కుళ్ళిపోయిన స్ధితిలో ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. ఉమాదేవి కుటుంబ ఉమాదేవి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నవారు మృతదేహం ఉమాదేవిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గురువారం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

ఈ విషయంలో మొదటి నుంచి ఆలయ పూజారి పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఉమాదేవి ఇంటికి తిరిగి రాకపోవటంతో అదే రోజు సాయంత్రం ఆమె భర్త స్వయంభూ వినాయక దేవాలయం వద్దకు వెళ్లి పూజారిని విచారించగా గుడికి ఉమాదేవి వచ్చి వెళ్లినట్లు చెప్పాడు. అయితే అప్పటికే గుడిని శుభ్రం చేసి తాళాలు వేసి ఉండటంపై ప్రశ్నించగా పిల్లి చనిపోతే శుభ్రం చేసి తాళాలు వేసినట్లు పూజారి సమాధానం చెప్పాడని ఆమె స్నేహితులు తెలిపారు.
Also Read : Delhi : ఢిల్లీలో దారుణం..పిల్లల ముందే తల్లిని హత్యచేసిన దుండగుడు

రెండు రోజులు గాలించినా కనపడని ఉమాదేవి… మూడు రోజుల తర్వాత గుడి వెనుక శవమై కనిపించింది. దీనికి తోడు ఆమె అదృశ్యమైన రోజు నుంచి పూజారి కూడా కనిపించకుండా పోవటంతో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పూజారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉమాదేవి ని హత్య చేసింది ఎవరు ?  ఈ హత్యలో పూజారి పాత్ర ఏమిటి  ? పూజారి పాత్ర ఉంటే   ఈహత్య లో పూజారి ఒక్కడే పాల్గోన్నాడా ? లేక అతనికి ఇంకెవరైనా సహాయం చేసారా అనే విభిన్న  అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు.