Woman Bites Lips : తిక్క కుదిరింది.. అత్యాచారం చేయబోయిన యువకుడి పెదవి కొరికేసిన మహిళ

కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారం చేయబోయిన ఓ యువకుడికి తగిన శాస్తి జరిగింది. బాధిత మహిళ ఆ యువకుడికి గట్టిగా బుద్ధి చెప్పింది. అతడి పెదవి కొరికి పడేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లో జరిగింది.

Woman Bites Lips : తిక్క కుదిరింది.. అత్యాచారం చేయబోయిన యువకుడి పెదవి కొరికేసిన మహిళ

Woman Bites Lips : కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారం చేయబోయిన ఓ యువకుడికి తగిన శాస్తి జరిగింది. బాధిత మహిళ ఆ యువకుడికి గట్టిగా బుద్ధి చెప్పింది. అతడి పెదవి కొరికి పడేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ లో జరిగింది.

ఓ మహిళ పొలంలో పని చేసుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు. అంతేకాదు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ మహిళ ఆ యువకుడిని తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ క్రమంలో ఆ యువకుడి పెదవిని తన పళ్లతో బలంగా కొరికింది. ఆమె ఎంత గట్టిగా కొరికిందంటే.. దెబ్బకు అతడి పెదవి ఊడి కింద పడిపోయింది.

Also Read..Accused Bit SI’s Ear : అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా.. ఎస్ఐ చెవి కొరికిన నిందితుడు

దీంతో అతడు నొప్పితో విలవిలలాడాడు. గట్టిగా కేకలు పెట్టాడు. ఇంతలో బాధితురాలు అతడి నుంచి తప్పించుకుంది. అరుపులు విని అక్కడికి చేరుకున్న గ్రామస్తులు.. ఆ యువకుడిని బంధించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కామాంధుడిని అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలో ఊడిపడిన పెదవిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గాయపడ్డ నిందితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Also Read..Girl Raped : ఢిల్లీలో మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

కాగా, ఆపద సమయంలో ఆ మహిళ చూసిన ధైర్యాన్ని స్థానికులు మెచ్చుకున్నారు. కామాంధుడి తిక్క కుదిర్చావ్ అని, వాడికి తగిన శాస్తి జరిగిందని ఆమెను ప్రశంసించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.