Girl Raped : ఢిల్లీలో మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Girl Raped : ఢిల్లీలో మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

gang-raped

girl raped : ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరికి చెందిన మూడేళ్ల బాలిక శుక్రవారం ఉదయం కనిపించకుండా పోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి పొరిగింటికి చెందిన ఓ వ్యక్తి తారసపడ్డాడు. తాను చిన్నారిని ఊరి చివరన ఉన్న అటవీ ప్రాంతంలో చూశానని చెప్పారు.

ఇద్దరు వ్యక్తులు ఆమెను తీసుకెళ్లినట్లు వెల్లడించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్లీడింగ్ కావడంతో ఆ చిన్నారి ఏడుస్తూ వారికి కనిపించింది. దీంతో ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. చికిత్స కోసం చిన్నారిని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Girl Raped : నిజామాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, పోస్టుమార్టంతో బయటపడ్డ షాకింగ్ నిజం

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు రామ్ నివాస్ పానిక(27), శక్తిమాన్ సింగ్(22) గా గుర్తించారు. వీరిద్దరికి వివాహమైందని, స్థానికంగా ఓ గార్బేజ్ రీసైకిల్ కంపెనీలో పనిచేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.