Viral Video : ఓ మై గాడ్.. రెచ్చిపోయిన దొంగలు, క్షణాల్లో బైకులు చోరీ.. వీడియో వైరల్

Viral Video: కొందరు దొంగలు క్షణాల్లో బైకులు చోరీ చేసిన ఘటన షాక్ కి గురి చేస్తోంది. అలా వచ్చి ఇలా బైకులను పట్టుకెళ్లిపోయారు.

Viral Video : ఓ మై గాడ్.. రెచ్చిపోయిన దొంగలు, క్షణాల్లో బైకులు చోరీ.. వీడియో వైరల్

Viral Video (Photo : Google)

Viral Video : దొంగలు రెచ్చిపోతున్నారు. అదను చూసి దోచేస్తున్నారు. వారి కన్ను పడిందా ఖతమే. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. ఎంతో దర్జాగా వచ్చి దోచుకెళ్లిపోతున్నారు. తాజాగా.. కొందరు దొంగలు క్షణాల్లో బైకులు చోరీ చేసిన ఘటన షాక్ కి గురి చేస్తోంది. అలా వచ్చి ఇలా బైకులను పట్టుకెళ్లిపోయారు. మోటార్ సైకిళ్ల చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దొంగల తెలివికి అంతా నివ్వెరపోతున్నారు.

దొంగలు ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ వీధిలో ఇళ్ల ముందు వరుసగా బైకులు పార్క్ చేసి ఉన్నాయి. అర్థరాత్రి దాటాక ముగ్గురు దొంగలు అక్కడికి వచ్చారు. ముందుగా వారు.. ఇళ్ల బయట వాకిళ్లకు గడియ పెట్టారు. శబ్దం వచ్చినా ఇంట్లో వారు బయటకు రాకుండా గడియ పెట్టి జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత తాళం వేసి ఉన్నప్పటికీ.. రెండు బైకులను ఎంతో ఈజీగా, చాకచక్యంగా చోరీ చేశారు. క్షణాల్లో బైకులను తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.(Viral Video)

Also Read.. YouTuber Arrested: యూట్యూబర్ తిక్క కుదిరింది..! మూడ్నెళ్ల క్రితం బర్త్ డే వేడుకల వీడియో వైరల్.. అరెస్టు చేసిన పోలీసులు

ఆ వీధిలో సుమారుగా 10 వరకు బైక్స్ ఉన్నాయి. ముగ్గురు దొంగలు వచ్చారు. ఒకడు ప్రతి ఇంటికి వెళ్లి బయటి నుంచి డోర్ లాక్ చేశాడు. మరొకడు ఎంతో అవలీలగా బైక్ తాళం తీశాడు. మరొకడు బైక్ పై కూర్చుని బలంగా తన కాలితో హ్యాండిల్ ను కొట్టాడు. దెబ్బకు హ్యాండిల్ లాక్ విరిగిపోయింది. అలా రెండు బైకులు తీసుకుని ముగ్గురు దొంగలు అక్కడి నుంచి ఉడాయించారు.

Also Read..Ice Cream : బాబోయ్.. ఐస్‌క్రీమ్ తిని బాలుడు మృతి.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

ఈ చోరీ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దొంగల తెలివికి అంతా నివ్వెరపోతున్నారు. లాక్ చేసి ఉన్నా.. ఎంతో చాకచక్యంగా, అవలీలగా హ్యాండిల్ లాక్స్ బ్రేక్ చేసి బైకులు చోరీ చేసిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. దొంగల తెలివికి నివ్వెరపోతున్నారు. ఇలాంటి దొంగతనాలకు బ్రేక్ పడాలంటే.. బైకులకు కేవలం హ్యాండిల్ లాక్ చేస్తే సరిపోదని, అంతకుమించిన సెక్యూరిటీ సిస్టమ్ అవసరమని అభిప్రాయపడుతున్నారు.(Viral Video)