Ice Cream : బాబోయ్.. ఐస్‌క్రీమ్ తిని బాలుడు మృతి.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

Ice Cream: ఐస్ క్రీమ్ తిని 12ఏళ్ల బాలుడు చనిపోయిన షాకింగ్ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఐస్ క్రీమ్ తిని బాలుడు చనిపోవడం ఏంటి? అని అంతా షాక్ అయ్యారు.

Ice Cream : బాబోయ్.. ఐస్‌క్రీమ్ తిని బాలుడు మృతి.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

Ice Cream (Photo : Google)

Ice Cream : ఐస్ క్రీమ్ అంటే పిల్లలకు చాలా ఇష్టం. లొట్టలేసుకుని మరీ ఐస్ క్రీమ్స్ తింటారు. ఎక్కడైనా ఐస్ క్రీమ్ షాప్ కనిపిస్తే చాలు.. కొనిచ్చే వరకు వదలరు. అంతిష్టం పిల్లలకు ఐస్ క్రీమ్స్ అంటే. అయితే, అదే ఐస్ క్రీమ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. 12ఏళ్లకే ఆ బాలుడికి నూరేళ్లు నిండేలా చేసింది. ఐస్ క్రీమ్ తిని 12ఏళ్ల బాలుడు చనిపోయిన షాకింగ్ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఐస్ క్రీమ్ తిని బాలుడు చనిపోవడం ఏంటి? అని అంతా షాక్ అవుతున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేశారు. వారి విచారణలో షాకింగ్ నిజాలు తెలిశాయి. ఐస్ క్రీమ్ లో విషం కలిపినట్లు పోలీసులు గుర్తించారు. విషం కలిపిన ఐస్ క్రీమ్ తినడం వల్లే బాలుడు చనిపోయాడని నిర్ధారించారు. మరి ఈ పని ఎవరు చేశారా? అని ఆరా తీయగా.. బాలుడి మేనత్త అని తెలిసి మరింత విస్తుపోయారు.(Ice Cream)

ఐస్ క్రీమ్ లో విషం కలిపి 12ఏళ్ల బాలుడిని అతడి మేనత్తే చంపిన దారుణ ఘటన కోజికోడ్ జిల్లాలో జరిగింది. ఈ నెల 16న అరికులంలో నివసించే తాహిరా (34) అనే మహిళ తన మేనల్లుడు అహ్మద్ హసన్ రిఫాయికి విషం కలిపిన ఐస్ క్రీమ్ ఇచ్చింది. అది తిన్న బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఐస్ క్రీమ్ లో విషం కలిసిందని, ఆ విషాన్ని బాలుడి మేనత్తే కలిపిందని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు ఆ కసాయి మేనత్తను అరెస్ట్ చేశారు. బాలుడి కుటుంబంతో గొడవల కారణంగా ఆమె ఇంతటి దారుణానికి పాల్పడింది.

Also Read.. YouTuber Arrested: యూట్యూబర్ తిక్క కుదిరింది..! మూడ్నెళ్ల క్రితం బర్త్ డే వేడుకల వీడియో వైరల్.. అరెస్టు చేసిన పోలీసులు

తాహిరా, బాలుడు హసన్ కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకున్న తాహిరా దారుణానికి ఒడిగట్టింది. ఆ కుటుంబాన్ని చంపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆ కుటుంబానికి విషం కలిపిన ఐస్ క్రీమ్ ఇచ్చింది. అరికులంలోని సూపర్ మార్కెట్ లో తాహిరా ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ కొనుగోలు చేసింది. తర్వాత అందులో విషం కలిపింది. దాన్ని తీసుకెళ్లి అహ్మద్ ఇంట్లో ఇచ్చింది. అయితే ఆ సమయంలో అహ్మద్ తల్లి, అతడి సోదరులు ఇంట్లో లేకపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.(Ice Cream)

ఐస్ క్రీమ్ డబ్బా చూడగానే అహ్మద్ కు నోరుఊరింది. వెంటనే డబ్బా ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ తిన్నాడు. అంతే, వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. అస్వస్థతకు గురయ్యాడు. కంగారుపడిన కుటుంబసభ్యులు అహ్మద్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అహ్మద్ చనిపోయాడు.(Ice Cream)

అయితే, పోలీసులకు ఎక్కడో అనుమానం కలిగింది. ఇది మర్డర్ అనే డౌట్ వచ్చింది. ఆ కోణంలో దర్యాఫ్తు ప్రారంభించారు. పోలీసులు ఐస్ క్రీమ్ శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపారు. చివరికి వారి అనుమానమే నిజమైంది. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తేలింది. ఐస్ క్రీమ్ లో విషం కలిపినట్లు గుర్తించారు. అటు అహ్మద్ శరీరంలో అమ్మోనియం ఫాస్పరస్ ఉన్నట్లు అటాప్సీ రిపోర్టులో వచ్చింది.

Also Read..Ice Cream : లొట్టలేసుకుని మరీ ఐస్ క్రీమ్స్ లాగించేస్తున్నారా? బీ కేర్‌ఫుల్, పోలీసుల దాడుల్లో షాకింగ్ నిజాలు

అంతే, పోలీసుల డౌట్ తీరిపోయింది. విషం కలిపిన ఐస్ క్రీమ్ తినడం వల్లే అహ్మద్ చనిపోయాడని నిర్ణారించారు. తమదైన స్టైల్ లో విచారించారు. ఐస్ క్రీమ్ డబ్బా ఎవరు ఇచ్చారు అని ఆరా తీయగా.. మేనత్త తాహిరా పేరు బయటపడింది. పోలీసులు ఆమెను తమ స్టైల్ లో ఎంక్వైరీ చేశారు. అంతే, తానే ఈ నేరం చేసినట్లు తాహిరా ఒప్పేసుకుంది. కుటుంబ గొడవల కారణంగా తాను ఇలా చేసినట్లు తాహిరా తెలిపింది.(Ice Cream)